వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఒక్కో రాష్ట్రం మా వశం, మోడీని ప్రజలు నమ్మారు: అమిత్ షా, కాంగ్రెస్‌కు 'కులం' షాక్

|
Google Oneindia TeluguNews

Recommended Video

ఒక్కో రాష్ట్రం మా వశం : శిరస్సు వంచి నమస్కారం

న్యూఢిల్లీ: గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలో గెలుపుపై బీజేపీ జాతీయ అధ్యక్షులు అమిత్ షా సోమవారం విలేకరులతో మాట్లాడారు. ప్రధాని మోడీ నేతృత్వంలో 2019లోను ఇవే ఫలితాలు వస్తాయని షా ధీమా వ్యక్తం చేశారు. వారసత్వ రాజకీయాలపై అభివృద్ధి గెలిచిందని వ్యాఖ్యానించారు.

ఊహించని దెబ్బ: మోడీ దూకుడుకు 'గుజరాత్' కళ్లెం, ఆ వైపు మోడీ చూపు!ఊహించని దెబ్బ: మోడీ దూకుడుకు 'గుజరాత్' కళ్లెం, ఆ వైపు మోడీ చూపు!

గుజరాత్, హిమాచల్ ప్రదేశ్‌లలోని ప్రజలు బీజేపీని నమ్మారని చెప్పారు. కోట్లాది మంది కార్యకర్తల కృషితో గెలుపు సాధ్యమైందని చెప్పారు. రెండు రాష్ట్రాల్లో బీజేపీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని చెప్పారు. రెండు రాష్ట్రాల ప్రజలకు హృదయ పూర్వక ధన్యవాదాలు తెలిపారు. ఈ గెలుపు బీజేపీ కార్యకర్తల విజయం అన్నారు.

బీజేపీ 'భారీ' విజయానికి అడ్డు ఇవే, చివరి నిమిషంలో.. గెలుపుకు కారణాలుబీజేపీ 'భారీ' విజయానికి అడ్డు ఇవే, చివరి నిమిషంలో.. గెలుపుకు కారణాలు

 కోట్లాది మంది కార్యకర్తల కృషి

కోట్లాది మంది కార్యకర్తల కృషి

ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలో కోట్లాది మంది కార్యకర్తలు గెలుపు కోసం కృషి చేశారని అమిత్ షా అన్నారు. తాము గుజరాత్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలలోని ప్రజల సంక్షేమం, సుపరిపాలనకు కట్టుబడి ఉన్నామని చెప్పారు. అభివృద్ధితో ముందుకు పోతామన్నారు.

ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తున్నాం

ఒక్కో రాష్ట్రాన్ని గెలుస్తున్నాం

హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రజలు అవినీతిని తిప్పికొట్టారని అమిత్ షా చెప్పారు. ఓటర్లు అభివృద్ధి, సుపరిపాలన, సంక్షేమానికి పెద్దపీట వేశారని చెప్పారు. మోడీ నేతృత్వంలో దేశ ప్రజలు అభివృద్ధిని కోరుకుంటున్నారని తెలిపారు. బీజేపీ ఒక్కో రాష్ట్రాన్ని గెలుచుకుంటూ పోతోందన్నారు.

 మోడీ నాయకత్వంలో 19 రాష్ట్రాలు

మోడీ నాయకత్వంలో 19 రాష్ట్రాలు

19 రాష్ట్రాల్లో ప్రధాని మోడీ నాయకత్వంలో బీజేపీ ప్రభుత్వాలు ఏర్పాటయ్యాయని అమిత్ షా చెప్పారు. హిమాచల్ ప్రదేశ్‌లో అధికారంలోకి రావడం ఆనందంగా ఉందని చెప్పారు. త్వరలో జరగబోయే నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లోను బీజేపీ గెలుస్తుందని జోస్యం చెప్పారు.

 కులం కార్డుతో కాంగ్రెస్ గెలవాలనుకుంది కానీ

కులం కార్డుతో కాంగ్రెస్ గెలవాలనుకుంది కానీ

గుజరాత్‌లో కాంగ్రెస్ పార్టీ కులం కార్డుతో గెలవాలనుకుందని అమిత్ షా ఆరోపించారు. కాంగ్రెస్ కుట్రను గుజరాత్ ప్రజలు తిప్పికొట్టారని చెప్పారు. మోడీ నాయకత్వంలో 2019లోను బీజేపీ అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అప్పుడు కూడా ప్రజల మద్దతు ఉంటుందన్నారు.

English summary
A visibly beaming Amit Shah on Monday thanked voters in Gujarat and Himachal Pradesh for showing faith in Prime Minister Narendra Modi's development model and accused Congress of stooping down to unprecedented lows during campaigning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X