• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

సభకు శాశ్వత నమస్కారం..! చట్టసభలకు దూరం కాబోతున్న మౌనముని..!!

|
  ఇక చట్టసభలకు సెలవు..! మౌనముని శాశ్వత విశ్రాంతి..!! || Oneindia Telugu

  ఢిల్లీ/హైదరాబాద్ : ఆయన ఓ నడిచే ఆర్థిక వ్యవస్థ.. ఎంతో మంది యువ నేతలకు రాజకీయ అడుగులు నేర్పిన పొలిటికల్ ప్రొఫెసర్ ఆయన. భారత్ ను ప్రపంచ దేశాలతో పోటీ పడేలా తన సరళీకృత ఆర్ధిక విధానాలు రూపొందించిన నేత. ఎనభై ఐదు సంవత్పరాల వయస్సు వచ్చినా ఇప్పటికి ఆయన పనితీరులో వేగం, స్పష్టత ఏమాత్రం తగ్గలేదు. పదేళ్ళు యుపిఏ సర్కార్ లో ప్రధానిగా, అంతకుముందు మాజీ ప్రధాని పివి నరసింహారావు ప్రభుత్వంలో ఆర్దికమంత్రిగా సేవలందించిన మౌన ముని మన్మోహన్ సింగ్ రాజ్యసభ పదవీకాలం ముగిసింది. కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న రాజకీయాల దృష్ట్యా ఆయనకు మళ్లీ రాజ్యసభ సభ్యత్వం ఇచ్చే అవకాశాలు కూడా లేకపోవడంతో సుధీర్గ రాజకీయ అనుభవం ఇప్పుడు విశ్రాంతి తీసుకోక తప్పని పరిస్థితులు నెలకొన్నాయి.

   ఇక చట్టసభలకు సెలవు..! మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శాశ్వత విశ్రాంతి..!!

  ఇక చట్టసభలకు సెలవు..! మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ శాశ్వత విశ్రాంతి..!!

  అయితే మన్మోహన్ సింగ్ను తిరిగి పెద్దల సభకు పంపించేంత బలం కాంగ్రెస్ కి లేకపోవడంతో ఆర్ధిక నిపుణుడి సేవలను దేశ అత్యున్నత చట్ట సభ కోల్పోతుంది. 1932 సెప్టెంబర్ 26 లో పాకిస్తాన్ లోని పంజాబ్ రాష్ట్రంలోని గాహ్ లో జన్మించారు మన్మోహన్ సింగ్. దేశ విభజన తరువాత అక్కడి నుంచి వచ్చిన మన్మోహన్ ఇంగ్లాండ్ కేంబ్రిడ్జ్ నుంచి ఆర్ధిక శాస్త్రంలో పట్టా అందుకున్నారు. 1982 లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ గా విశేష సేవలందించారు.

  సరళీకృత ఆర్థిక విధానాలతో భారత్ ముందంజ..! దేశ వృద్దికి మన్మోహన్ ఆర్థిక విధానాలే కారణం..!!

  సరళీకృత ఆర్థిక విధానాలతో భారత్ ముందంజ..! దేశ వృద్దికి మన్మోహన్ ఆర్థిక విధానాలే కారణం..!!

  ఆ తరువాత 1991లో పీవీ నరసింహారావు ప్రధానిగా బాధ్యతలు చేపట్టిన నాటికి దేశాన్ని గాడిన పెట్టె ఆర్ధిక వేత్త కోసం గాలించి శోధించారు. పీవీ నరసింహారావు సలహాదారు పిసి అలెంగ్జాన్డర్ ఇచ్చిన సలహాతో మన్మోహన్ సింగ్ ను రప్పించి ఆయనను రాజ్యసభకు పంపి ఆర్ధికమంత్రిని చేశారు నరసింహారావు. ఆ తరువాత 2004 లో యుపిఎ ప్రధాని అభ్యర్థిగా సోనియా తప్పుకోవడంతో మన్మోహన్ అన్ని వర్గాలకు ఆమోదయోగ్యుడిగా ఉండటంతో ప్రధాని కీరిటం ఆయన్ను వరించింది.

  అజాత శత్రువు..! అన్ని వర్గాలను అలరించిన నేత మన్మోహన్ సింగ్..!!

  అజాత శత్రువు..! అన్ని వర్గాలను అలరించిన నేత మన్మోహన్ సింగ్..!!

  పీవీ హయం నుంచి సోనియా, రాహుల్ జమానా వరకు అస్సాం నుంచి రాజ్యసభకు ఎంపిక అవుతున్న మన్మోహన్ కు ఇప్పుడు ఛాన్స్ లేకుండా పోయింది. ఒడిస్సా ఇతర రాష్ట్రాలనుంచి ఆయన్ను రాజ్యసభకు వెంటనే పంపే అంత బలం కాంగ్రెస్ తాజా ఎన్నికల్లో కోల్పోవడంతో అజాతశత్రువు ఇప్పుడు విశ్రాంత జీవితం గడపనున్నారు. వయోభారం రీత్యా ఆయన అవసరాలతో ప్రస్తుతం కాంగ్రెస్ కి పని లేనందున త్వరలో ఏర్పడే రాజ్యసభ స్థానాల ఖాళీలో ఇతర రాష్ట్రాల నుంచి పెద్దల సభకు ఆయన్ను పంపే అవకాశాలు ఇప్పుడు లేవంటున్నారు విశ్లేషకులు.

   వయో భారం..! ఇక చట్ట సభలకు దూరం..!!

  వయో భారం..! ఇక చట్ట సభలకు దూరం..!!

  దేశ రాజకీయాల్లో అలుపెరగని, అసమాన్యమైన ఆర్తిక నిపునుడిగా ముద్ర వేసుకున్న మన్మోహన్ సింగ్ రాజకీయ సేవలు విశ్రాంతిని కోరుకోవడం సాటి నేతలకు విచారం కలిగిస్తోంది. ఆయన సేవలను మళ్లీ వినియోగించుకునే అవకాశం లేకపోవడంతో ఓ బృహత్కర శకం ముగిసిందనే భావనను వ్యక్తం చేయాల్సి వస్తోందదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు సహచర నేతలు. మొత్తానికి తన ఉద్యోగ జీవితంలో కానీ, రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తిగా దేశానికి సేవలందించిన మన్మోహన్ సింగ్ శేష జీవితం సాఫీగా సాగాలని ఆయన సలహాలు సూచనలు ఇస్తూనే వుండాలని అంతా కోరుకుంటున్నారు.

  తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!

  English summary
  Although he has reached the age of eighty-five,his speed and clarity has not diminished. The tenure of Rajya Sabha has come to an end with Mauna Muni Manmohan Singh, who served as Prime Minister in the UPA Sarkar for ten years and former Prime Minister PV Narasimha Rao as the Union Minister of State. In view of the politics of the Congress party, he was not even able to get Rajya Sabha membership again.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X
  We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more