అజ్మీర్ షరీఫ్ దర్గా ఓ శివాలయం: పిటిషన్, వారికి కోర్టు నోటీసులు

దేశంలోని పలు మసీదులపై ఇప్పటికే కేసులు కొనసాగుతున్న విషయం తెలిసిందే. తాజాగా, రాజస్థాన్ రాష్ట్రంలోని అజ్మీర్ షరీఫ్ దర్గా నిజానికి ఓ శివాలయం అంటూ హిందూ సేన జాతీయ అధ్యక్షుడు విష్ణు గుప్తా దాఖలు చేసిన పిటిషన్‌ను అజ్మీర్‌లోని దిగువ కోర్టు విచారణకు స్వీకరించింది. అజ్మీర్ వెస్ట్ సివిల్ జడ్జీ మన్మోహన్ చందేల్ అధ్యక్షత వహించిన కోర్టు తదుపరి విచారణను డిసెంబర్ 20కి షెడ్యూల్ చేసింది.

సూఫీ సన్యాసి ఖ్వాజా మొయినుద్దీన్ చిస్తీ సమాధి.. నిజానికి శివుడి ఆలయమని విష్ణు గుప్తా తెలిపారు. అజ్మీర్ షరీఫ్ దర్గాలో "కాశీ, మధురలో" వంటి హిందూ ఆలయం ఉందని గుప్తా పేర్కొన్నారు. దర్గా కిటికీలపై ఓం, స్వస్తిక్ చిహ్నాలు కనిపించాయని హిందూ పక్షం తన పిటిషన్‌లో పేర్కొంది.

Petition alleging a Shiva temple under Ajmer Sharif Dargah Court notices to Minority Ministry ASI

మరోవైపు, దర్గాను సర్వే చేయాలని ఆయన తన పిటిషన్‌లో కోరారు.
పిటిషన్ స్వీకరించిన అజ్మీర్‌లోని స్థానిక కోర్టు కేంద్ర మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా (ASI)కి నోటీసులు జారీ చేసింది.

'మేము పిటిషన్ ఎందుకు దాఖలు చేస్తున్నాము అని కూడా కోర్టు మమ్మల్ని ప్రశ్నించింది. మేము కోర్టుకు ప్రతిదీ చెప్పాము. మా వాదనలను శ్రద్ధగా విన్న తర్వాత, కోర్టు సంతృప్తి చెందిన తర్వాత సంబంధిత పక్షాలకు నోటీసు జారీ చేసింది' అని గుప్తా తెలిపారు. అంతేగాక, 'బ్రిటీష్ పాలనలో ముఖ్యమైన పదవిలో ఉన్న హర్ బిలాస్ సర్దా 1910లో హిందూ దేవాలయం గురించి రాశాడు' అని గుప్తా పేర్కొన్నారు.

తన పుస్తకంలో, న్యాయమూర్తి, రాజకీయవేత్త, విద్యావేత్త అయిన సర్దా దర్గా గురించి ఇలా వ్రాశాడు: "సాంప్రదాయం ప్రకారం సెల్లార్ లోపల ఒక ఆలయంలో మహాదేవుని ప్రతిమ ఉంటుంది. దానిపై ఒక బ్రాహ్మణ కుటుంబం ప్రతిరోజూ గంధంతో అభిషేకం చేస్తుండేది. ఇప్పటికీ అది దర్గాచే ఘర్యాలీ (బెల్ స్ట్రైకర్)గా నిర్వహించబడుతోంది.

'అజ్మీర్‌లో సర్దా పేరుతో రోడ్లు ఉన్నాయి, కాబట్టి కోర్టు అతని మాటలను సీరియస్‌గా తీసుకోవాలని మేము చెప్పాము, కనీసం ఒక సర్వే అయినా జరగాలి, తద్వారా నిజం బయటపడుతుంది' అని గుప్తా అన్నారు. హిందూ, జైన దేవాలయాలను కూల్చిన తర్వాత అజ్మీర్ నిర్మాణం జరిగిందని తెలిపారు.

'50 సంవత్సరాల క్రితం, ఒక పూజారి అక్కడ ప్రార్థనలు చేసేవాడని, అక్కడ శివలింగం కూడా ఉండేదని, దానిని నేలమాళిగకు తరలించారని స్థానికులు చెబుతున్నారు. కాబట్టి అందరికీ స్పష్టత వచ్చేలా సర్వే చేయాలి' అని అన్నారు. దర్గాను హిందూ దేవాలయంగా ప్రకటించాలని.. దానికి రిజిస్ట్రేషన్ ఉంటే, దానిని రద్దు చేయాలి, ASI సర్వే నిర్వహించాలి. మేము పూజలు చేయడానికి అనుమతించాలి' అని ఆ హిందూ నేత అన్నారు.

వచ్చే ఏడాది జనవరిలో అజ్మీర్ దర్గా తన 813వ ఉర్సును జరుపుకోనుంది. దీని గురించి గుప్తా ఇలా అన్నాడు.. "చిస్తీ సాహెబ్ ఇక్కడ పుట్టలేదు, అతను ఇక్కడ నుండి కాదు. కాబట్టి, అతనికి ముందు ఇక్కడ ఎవరు ఉన్నారు? పృథ్వీరాజ్ చౌహాన్.. నగరం అజయ్మేరు అని పిలువబడిందని పేర్కొన్నారు. ఇది ఇలావుండగా, ముస్లిం సమాజంపై ద్వేషం పెంచేందుకే కేసు పెట్టారని దర్గా గడ్డి నషీన్ (సంరక్షకుడు) సయ్యద్ సర్వర్ చిష్టీ అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+