వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

హౌ డేర్: అర్నబ్ అరెస్ట్‌‌‌పై సుప్రీం చీఫ్ జస్టిస్ ఫైర్: కోర్టు ధిక్కరణ: హరీష్ సాల్వే ఎంట్రీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సీనియర్ జర్నలిస్ట్, రిపబ్లిక్ టీవీ ఎడిటర్ ఇన్ చీఫ్ ఆర్నబ్ గోస్వామి అరెస్టు వ్యవహారంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఆయనను అరెస్టు చేయడాన్ని దేశ అత్యున్నత న్యాయస్థానం తప్పుపట్టింది. అర్నబ్‌ను ఎలా అరెస్టు చేస్తారని ప్రశ్నించింది. ప్రివిలేజ్ నోటీసులను అందుకున్న వ్యక్తిని అరెస్టు చేయడం పట్ల అభ్యంతరం వ్యక్తం చేసింది. స్టే మంజూరు చేసింది. అలాగే- మహారాష్ట్ర ప్రభుత్వానికి కోర్టు ధిక్కారణ నోటీసులను జారీ చేసింది. ఆ రాష్ట్ర అసెంబ్లీ కార్యదర్శికి నోటీసులను పంపించింది.

అతనంటే విరాట్ కోహ్లీకి జ్వరం: సైంధవుడిలా అడ్డు: సన్ రైజర్స్ పేసర్ చేతిలో దారుణ పరాభవంఅతనంటే విరాట్ కోహ్లీకి జ్వరం: సైంధవుడిలా అడ్డు: సన్ రైజర్స్ పేసర్ చేతిలో దారుణ పరాభవం

అర్నబ్ గోస్వామి అరెస్టు వ్యవహారంపై దాఖలైన పిటీషన్‌పై సుప్రీంకోర్టు విచారణ చేపట్టింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ శరద్ అరవింద్ బొబ్డే సారథ్యంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం ఈ పిటీషన్‌పై విచారణ నిర్వహించింది. జస్టిస్ ఏఎస్ బొపన్న, జస్టిస్ వీ రామసుబ్రమణియన్ ఈ బెంచ్‌లో ఉన్నారు. ఆర్నబ్ గోస్వామి తరఫున ప్రఖ్యాత న్యాయవాది హరీష్ సాల్వే వాదనలను వినిపించారు. అసెంబ్లీ స్పీకర్, ప్రివిలేజ్ కమిటీ ముందు మాత్రమే దాఖలు పర్చాల్సిన ఈ లెటర్‌ను కార్యదర్శి ఎలా బహిర్గతం చేయగలరని హరీష్ సాల్వే వాదించారు. రహస్యంగా లెటర్‌ను బహిర్గతం చేశారని చెప్పారు.

 Petitioner Arnab Goswami cant be arrested till further hearing in privilege notice

దీనిపై చీఫ్ జస్టిస్ ఎస్ ఏ బొబ్డే తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. హౌ డేర్ అంటూ అసెంబ్లీ కార్యదర్శిని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఆయనకు ఎంత ధైర్యం. ఆర్టికల్ 32 ఏం చెబుతోందో తెలియదా? అని ప్రశ్నించారు. రహస్యంగా ఉంచాల్సిన లేఖను బహిర్గతం చేయడం ఏ మాత్రం తేలిగ్గా తీసుకోలేమని అన్నారు దీన్ని తీవ్రంగా పరిగణిస్తున్నామని చెప్పారు. న్యాయ వ్యవహారాల్లోశాసనసభ జోక్యం చేసుకున్నట్టుగా కనిపిస్తోందని చెప్పారు. న్యాయ పాలనా వ్యవస్థలో జోక్యంగా పరిగణించాల్సి ఉందని అన్నారు.

ఒక వ్యక్తి (ఆర్నబ్ గోస్వామి) సుప్రీంకోర్టును ఆశ్రయించేంతలా భయపెట్టారని వ్యాఖ్యానించారు. ఈ వ్యవహారాన్నిసుమోటోగా తీసుకోవాలంటూ హరీష్ సాల్వే చేసిన విజ్ఙప్తి పట్ల సుప్రీంకోర్టు ధర్మాసనం సానుకూలంగా స్పందించింది. అనంతరం తన ఆదేశాలను వినిపించింది. న్యాయ వ్యవహారాలు, అసెంబ్లీకి సంబంధించిన అంశాలను బహిర్గతం చేయడాన్ని తాము కోర్టు ధిక్కారణ కింద పరిగణిస్తున్నామని ధర్మాసనం పేర్కొంది. న్యాయ పరిపాలనలో జోక్యం చేసుకున్నట్టుగా భావిస్తున్నామని వెల్లడించింది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 32కు భిన్నంగా అసెంబ్లీ కార్యదర్శి వ్యవహరించినట్లుగా కనిపిస్తోందని పేర్కొంది. ఆయనకు నోటీసులను జారీ చేస్తున్నట్లు స్పష్టం చేసింది.

English summary
A bench headed by Supreme Court Chief Justice SA Bobde also said that the petitioner Arnab Goswami can't be arrested till further hearing in privilege notice issued against his case. Maharashtra Assembly Secretary had issued a privilege notice against Arnab.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X