వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రగులుతున్న తూత్తుకుడి: పోలీస్ స్టేషనుపై పెట్రోల్ బాంబు దాడి..

|
Google Oneindia TeluguNews

తూత్తుకుడి: తూత్తుకుడి ఇంకా రగులుతూనే ఉంది. స్థానిక పోలీస్ స్టేషనుపై ఆందోళనకారులు పెట్రోల్ బాంబుతో దాడి చేశారు. దీంతో ప్రస్తుతం అక్కడ పరిస్థితి ఉద్రిక్తతంగా మారినట్టు తెలుస్తోంది. బాంబు దాడిలో ఎవరైనా గాయపడ్డారా? అన్నది ఇంకా తెలియాల్సి ఉంది.

ఇదిలా ఉంటే, తూత్తుకుడి పోలీసుల కాల్పుల్లో 13మంది చనిపోయిన ఘటనకు నిరసనగా రచయితలు, జర్నలిస్టులు చెన్నై చెపాక్ ప్రాంతంలో నిరసనలకు దిగారు. స్టెరిలైట్ ఫ్యాక్టరీకి వ్యతిరేకంగా జరుగుతున్న ఉద్యమానికి వారు సంఘీభావం తెలిపారు.

Petrol Bomb Attack On Thoothukudi Police Station

కాగా, తూత్తుకుడిలో నాలుగు రోజుల క్రితం పోలీసుల కాల్పుల్లో 13 మంది ఆందోళనకారులు మరణించిన విషయం తెలిసిందే. వేదాంత సంస్థకు చెందిన స్టెరిలైట్ ఫ్యాక్టరీని శాశ్వతంగా మూసివేయాలని అక్కడి ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. ఫ్యాక్టరీ కారణంగా గాలి, నీరు కలుషితమై చుట్టు పక్కల గ్రామాల ప్రజలు క్యాన్సర్ బారిన పడుతున్నారని వారు ఆరోపిస్తున్నారు.

English summary
Protesters thrown a petrol bomb on Thoothukudi police station on Saturday morning.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X