వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రికార్డు స్థాయిలో పెట్రోల్, డీజీల్ ధరలు: 5 ఏళ్ల తర్వాత ఢిల్లీలో గరిష్టానికి పెట్రోల్

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

5 ఏళ్ల తర్వాత ఢిల్లీలో గరిష్టానికి చేరిన పెట్రోల్ ధరలు

న్యూఢిల్లీ: కర్ణాటక ఎన్నికలను పురస్కరించుకొని పెట్రోల్, డీజీల్ ధరలను సుమారు19 రోజుల పాటు మారలేదు. కానీ, .పోలింగ్ పూర్తైన వెంటనే పెట్రోల్, డీజీల్ ధరలు పెరుగుతున్నాయి. న్యూఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ. 75 దాటింది. 2013 తర్వాత ఇదే ఢిల్లీలో రికార్డు ధర కావడం విశేషం.

వరుసగా మూడు రోజుల నుంచి పెట్రోల్‌, డీజిల్‌ ధరలు పెరిగిపోతున్నాయి. బుధవారం దేశ రాజధాని ఢిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.75 మార్కును దాటింది. ఢిల్లీలో ఇవాళ లీటరు పెట్రోల్‌ ధర రూ.75.10గా నమోదైంది. 2013 సెప్టెంబర్‌ నుంచి ఇదే గరిష్ట స్థాయి..

కోల్‌కతా, ముంబై, చెన్నైల్లో కూడా పెట్రోల్‌ ధరలు మండిపోతున్నాయి. కోల్‌కతాలో లీటరు పెట్రోల్‌ ధర రూ.77.79గా, ముంబైలో రూ.82.94గా, చెన్నైలో రూ.77.93గా, హైదరాబాద్‌లో రూ.79.55గా నమోదయ్యాయి. ఢిల్లీ, ముంబైలో ఈ ధరలు 14 పైసలు పెరగగా.. చెన్నై, కోల్‌కతాలో 16 పైసలు పెరిగాయి.

Petrol crosses Rs 75 per litre in Delhi

మరోవైపు డీజిల్‌ ధరలు కూడా సరికొత్త గరిష్ట స్థాయిలను తాకాయి. లీటరు డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.66.57గా, కోల్‌కతాలో రూ.69.11గా, ముంబైలో రూ.70.88గా, చెన్నైలో రూ.70.25గా, బెంగళూరులో రూ.67.71గా, హైదరాబాద్‌లో రూ.72.36గా నమోదవుతోంది.

అంతర్జాతీయంగా ధరలు పెరగడంతో, ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలకు దాదాపు రూ.500 కోట్ల మేర నష్టం వచ్చినట్టు అంచనాలు వెలువడుతున్నాయి. ఈ నష్టాన్ని పూరించుకోవడానికి ప్రభుత్వ రంగ ఆయిల్‌ మార్కెటింగ్‌ కంపెనీలు రికార్డు స్థాయిలో ఈ ధరలను పెంచుతున్నాయి.

English summary
Petrol prices continued to rise across the country on Wednesday and crossed the Rs 75 per litre mark in the national capital.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X