వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు, అదనపు భారం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు గురువారం నాడు మరోసారి పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 5 పైసలు,డీజీల్‌పై 9 పైసలు చొప్పున పెరిగింది. ప్రతి రోజూ అంతర్జాతీయ మార్కెట్లో చమురు ధరలకు అనుగుణంగా పెట్రోల్,డీజీల్ రేట్లను సవరిస్తున్నారు.. ఇవాళ్టి రేట్లకు అనుగుణంగా పెట్రోల్, డీజీల్ ధరలను పెంచుతూ ఆయిల్ కంపెనీలు నిర్ణయం తీసుకొన్నాయి.

ఢిల్లీలో ప్రస్తుతం లీటర్ డీజీల్‌ దర రూ. 65.27కు చేరింది, పెట్రోల్ లీటర్ ధర రూ. 74.70లకు చేరింది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.81.92కు చేరుకుంది.చెన్నైలో పెట్రోల్ లీటర్‌ ధర రూ.76.84కు చేరుకొంది.కోల్‌కత్తాలో లీటర్ పెట్రోల్‌కు రూ. 76.77, డీజీల్ ధర కోల్‌కత్తాలో లీటర్ రూ.67.97, ముంబైలో రూ.69.50, చెన్నైలో లీటర్ డీజీల్‌కు రూ.68.86 చేరుకొంది.

Petrol, diesel price on 19th April 2018: Check out rates here city-wise

ప్రతి రోజూ పెట్రోల్, డీజీల్ ధరల సమీక్ష కారణంగా ఎంత మేరకు ధరలు పెరిగాయనే విషయమై సామాన్యులు ఒకేసారి గుర్తించలేకపోతున్నారు. గతంలో మాదిరిగా 15 రోజులకు ఓ సారి పెట్రోల్, డీజీల్ ధలను సవరిస్తే ఎంత మొత్తంలో పెట్రోల్, డీజీల్ ధరలు పెరిగాయనే విషయమై అవగాహన ఉండేది. కానీ, ప్రతి రోజూ ఎంతో కొంత మేరకు ఈ ధరలు పెరుగుతున్న పరిస్థితి నేరుగా వినియోగదారుడి పరిశీలిస్తే తప్ప గుర్తించలేకపోతున్నాడు.

పెట్రోల్, డీజీల్‌లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల పన్నుల కారణంగా వినియోగదారుడు అదనంగా చెల్లించాల్సి వస్తోంది. అయితే రాష్ట్రాలకు ఎక్కువగా పెట్రోల్, డీజీల్‌ల ద్వారా ఎక్కువగా ఆదాయం సమకూరుతోంది.

దీంతో పన్నుల తగ్గింపుకు రాష్ట్రాలు ఆసక్తిని చూపడం లేదు. మరోవైపు పెట్రోల్, డీజీల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకొని రావాలని డిమాండ్ కూడ ఉంది. కేంద్రం కూడ ఈ విషయాన్ని పరిశీలిస్తోంది.

పెట్రోల్, డీజీల్‌ను జిఎస్టీ పరిధిలోకి తెస్తే ధరలు మరింత తగ్గే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.పెట్రోల్, డీజీల్ ధరలు పెరగడంపై ప్రజలు అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు.

English summary
Petrol prices were hiked by 5 paise and diesel prices by 9 paise, applicable from 6:00 a.m. on 19th April 2018.Under the dynamic pricing scheme, petrol and diesel prices are revised on a daily basis in sync with global crude oil prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X