వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వాహనదారులకు గుడ్‌న్యూస్: భారీగా తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు..

|
Google Oneindia TeluguNews

వాహనదారులకు శుభవార్త. పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా తగ్గాయి. పెట్రోలియం సరఫరా చేసే దేశాల మధ్య ధరల యుద్ధం తీవ్రం కావడంతో గ్లోబల్ మార్కెట్‌లో ధరలు భారీగా పతనమయ్యాయి. 1991 గల్ఫ్ యుద్ధం తర్వాత పెట్రో ధరలు తగ్గాయి. ఇదే కాదు మరో 15 రోజులపాటు పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతాయని విశ్లేషకులు చెబుతున్నారు. అయితే ఏప్రిల్ 1 నుంచి మాత్రం జీఎస్ 6 నిబంధనల వల్ల మాత్రం ధరలు పెరిగే అవకాశం ఉంది.

హోలీ తర్వాత ప్రజలకు సంతోషం కలిగించే వార్తను ఆయిల్ కంపెనీలు ప్రకటించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరలు పతనం కావడంతో.. పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించినట్టు పేర్కొన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.70.29కు చేరింది. పెట్రోల్‌పై రూ.2.69 తగ్గగా.. డీజిల్‌పై రూ.2.33 తగ్గింది. లీటర్ డీజిల్ రూ.63.01కి చేరింది. మంగళవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.72.98కి విక్రయించగా.. డీజిల్ రూ.65.34కి విక్రయించారు.

petrol, diesel prices are down

సోమవారం రోజున పెట్రోల్, డీజిల్ ధరలు రూ.71 మార్క్ చేరాయి. 8 నెలల తర్వాత కనిష్ట స్థాయికి చేరుకున్నాయి. లీటర్ పెట్రోల్ రూ.70.59కి చేరింది. ఇది 2019 జూలై తర్వాత కనిష్ట ధరకు చేరింది. అంతర్జాతీయ మార్కెట్లలో నెలకొన్న పరిస్థితులతో ఫిబ్రవరి 27వ తేదీ నుంచి పెట్రో ఉత్పత్తలు ధరలు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.

English summary
price of petrol per litre in Delhi on Wednesday went down by rupees 2.69 at rupees 70.29. Diesel will be sold across Delhi at rupees 63.01, down by rupees 2.33.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X