వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మరింత రిలీఫ్: నేడూ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు, ఎంతంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రో ధరలు నేడు కూడా తగ్గి వాహనదారులకు మరింత ఉపశమనం కలిగించింది. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో గత కొద్ది రోజులుగా దేశంలో ఇంధన ధరలు దిగొస్తున్న విషయం తెలిసిందే. గడిచిన ఎనిమిది రోజుల్లో పెట్రోల్‌ ధర రూ. 2 తగ్గగా.. శనివారం కూడా ఆ తగ్గింపు కొనసాగింది.

శనివారం పెట్రోల్‌ ధర మరో 40 పైసలు తగ్గి దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ ధర రూ. 80.45కు చేరింది. అటు డీజిల్‌ కూడా 35 పైసలు దిగొచ్చి లీటర్‌ ధర రూ. 74.38గా ఉంది.

Petrol, diesel prices continue to decline

ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబైలోనూ ఇంధన ధరలు తగ్గాయి. ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర 40 పైసలు తగ్గి రూ. 85.93, డీజిల్‌ ధర 37 పైసలు తగ్గి రూ. 77.96గా ఉంది.

ఇటీవల రెండు నెలల పాటు ఇంధన ధరలు ఆకాశాన్నంటిన విషయం తెలిసిందే. దీంతో పెట్రోభారం నుంచి వినియోగదారులకు ఊరట కల్పించేందుకు ప్రభుత్వం అక్టోబర్ 4వ తేదీన పెట్రోల్‌, డీజిల్‌పై రూ. 2.50 చొప్పున ఎక్సైజ్‌ సుంకాన్ని తగ్గించింది.

English summary
Petrol and diesel prices in Delhi are Rs 80.45 per litre (decrease by Rs 0.40) and Rs 74.38 per litre (decrease by Rs 0.35), respectively on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X