వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
వినియోగదారులకు భారీ ఊరట: వరుసగా 11వ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు
న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా పదకొండో రోజు కూడా తగ్గాయి. గత గురువారం కాకుండా అంతకుముందు గురువారం నుంచి ఎంతోకొంత తగ్గుతూ వస్తున్న చమురు ధరలు ఆదివారం కూడా స్వల్పంగా తగ్గాయి.
అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో గత కొన్ని రోజులుగా ఇంధన ధరలు దిగి వస్తున్నాయి. ఈ రోజు దేశ రాజధాని ఢిల్లీలో మరో 40 పైసలు తగ్గి లీటర్ పెట్రోల్ ధర రూ.80.05కు చేరింది. డీజిల్ ధర 33 పైసలు తగ్గి రూ.74.05గా ఉంది.

ముంబైలో పెట్రోల్ ధర 39 పైసలు తగ్గింది. దీంతో రూ.85.54కు, డీజిల్ 35పైసలు తగ్గి రూ.77.61కి చేరింది. హైదరాబాద్లో పెట్రోల్ ధర రూ.84.86గా ఉంది. డీజిల్ ధర రూ.80.55గా ఉంది. విజయవాడలో పెట్రోల్ ధర రూ.84.19, డీజిల్ ధర రూ.79.46గా ఉంది.
తెలుగు మ్యాట్రిమోనిలో మీకు నచ్చిన జీవిత భాగస్వామి ఎంపికలు - రిజిస్ట్రేషన్ ఉచితం!