వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుసగా 11వ రోజు తగ్గుదల: గత 10 రోజుల కంటే ఎక్కువ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోలు, డీజిల్ ధరలు వరుసగా పదకొండో రోజు తగ్గాయి. శనివారం నాడు 40-42 పైసలు తగ్గింది. గత పది రోజులతో పోలిస్తే నేడు అత్యధిక తగ్గింపు నమోదైంది. శనివారం పెట్రోల్‌పై 40పైసలు, డీజిల్‌పై 30పైసలు తగ్గిస్తున్నట్లు ఆయిల్‌ కంపెనీలు ప్రకటించాయి.

శనివారం ఉదయం 6 గంటల నుంచి ఈ తగ్గింపు అమల్లోకి వచ్చింది. తాజా తగ్గింపుతో దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 77.02గా ఉంది. ఇండియన్ ఆయిల్‌ కార్పొరేషన్ ధరల ప్రకారం.. ముంబైలో రూ. 84.84, కోల్‌కతాలో రూ. 79.68, చెన్నైలో రూ. 79.95గా ఉంది. హైదరాబాదులో లీటర్ పెట్రోల్ ధర రూ. 81.59గా ఉంది.

 Petrol, Diesel Prices Cut For 11th Straight Day In A Row. Revised Fuel Rates Here

లీటర్‌ డీజిల్‌ ధర ఢిల్లీలో రూ. 68.28, ముంబైలో రూ. 72.70, కోల్‌కతాలో రూ. 70.83, చెన్నైలో రూ. 72.08గా ఉంది. హైదరాబాదులో డీజిల్ ధర రూ.75.20కి తగ్గింది. మొత్తంగా ఈ పదకొండు రోజుల కాలంలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 1.41, డీజిల్‌ ధర రూ. 1.03 తగ్గింది.

English summary
Petrol prices on Saturday slashed by 40-42 paise per litre in Delhi, Kolkata, Mumbai and Chennai, compared with the previous day's rates. Diesel prices were lowered by 30-32 paise per litre, according to Indian Oil Corporation's website.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X