హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

వరుసగా 13వ రోజూ తగ్గిన పెట్రో ధరలు: నేటి ధరలు ఇవే

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరుసగా 13వ రోజు కూడా పెట్రో ధరలు తగ్గడం వాహనదారులకు మరింత ఊరటనిచ్చింది. అంతర్జాతీయ ముడి చమురు ధరలు తగ్గుతుండటంతో కొద్ది రోజులుగా దేశీయంగా కూడా ఇంధన ధరలు తగ్గుతున్న విషయం తెలిసిందే.

తాజాగా, మంగళవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు స్వల్పంగా తగ్గాయి. దేశ రాజధాని ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర 20పైసలు తగ్గి రూ.79.55గా ఉంది. డీజిల్ లీటర్ ధర 7పైసలు తగ్గి రూ.73.85కు చేరింది.

Petrol, diesel prices cut for 13th straight day

ఇక ఇంధన ధరలు ఎక్కువగా ఉండే ముంబైలో లీటర్ పెట్రోల్ ధర 20పైసలు తగ్గి రూ.85.04గా ఉంది. లీటర్ డీజిల్ ధర 8పైసలు తగ్గి రూ.77.32కు చేరింది. చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.82.65కాగా, లీటర్ డీజిల్ ధర రూ.78గా ఉంది.
కోల్‌కతాలో లీటర్ పెట్రోల్ ధర రూ.81.43గా, ఉండగా, డీజిల్ ధర రూ.75.63గా ఉంది. హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్ ధర 21పైసలు తగ్గి 84.33గా ఉంది. డీజిల్ ధర 8పైసలు తగ్గి 80.25గా ఉంది.

English summary
The downward slide in petrol and diesel price continued Tuesday. Petrol price was cut by 20 paise a litre and now costs Rs 79.55 per litre in Delhi. Diesel rates were reduced by Rs 0.07 to Rs 73.85 a litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X