వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్ళీ పెరిగిన పెట్రోల్, డీజీల్ ధరలు, నాలుగేళ్ళ తర్వాత అత్యధికం

By Narsimha
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజీల్ ధరలు మళ్ళీ పెరిగాయి. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్నికలను పురస్కరించుకొని ఇంత కాలం పాటు పెట్రోల్, డీజీల్ ధరలు పెరగలేదని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నికలు ముగిసిన రెండు రోజులకే పెట్రోల్, డీజీల్ ధరలు మరోసారి పెరిగాయి. సుమారు 19 రోజుల తర్వాత ఈ ధరలు పెరిగాయి.

సోమవారం నాడు లీటర్ పెట్రోల్‌ ధర రూ. 17 పైసలు పెరిగింది. డీజీల్‌కు లీటర్‌కు రూ. 21 పైసలు పెరిగింది. దీంతో రికార్డు స్థాయిలో ఈ రెండింటి దరలు పెరిగినట్టు అయిందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. ఢిల్లీలో పెట్రోల్ లీటర్ ధర నాలుగేళ్ళ ఎనిమిది మాసాల తర్వాత అత్యధిక ధరను నమోదు చేసినట్టైందని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.

Petrol, Diesel Prices Hiked After A Gap Of 19 Days: 10 Things To Know

డీజీల్ ధర లీటర్‌కు రూ. 66 కు చేరుకొంది. డీజీల్ ధర కూడ ఆల్‌టైం హైకి చేరుకొంది. కోల్‌కత్తాలో లీటరుక5 పైసలు, ముంబైలో 23 పైసలు, చెన్నైలో 23 పైసలు డీజీల్ కు పెరిగింది. కోల్‌కతాలో 18 పైసలు, ముంబైలో 17 పైసలు, చెన్నైలో లీటర్ కు 18 పైసలు పెట్రోల్ పై ధరలు పెరిగాయి.

పెరిగిన ధరల ప్రకారంగా ఢిల్లీలో పెట్రోల్ లీటర్ కు రూ. 74.8, కోల్ కత్తాలో రూ.77.5, ముంబైలో రూ.82.5, చెన్నైలో రూ.77.61లకు చేరుకొంది,. లీటర్ డీజీల్ ధర ఢిల్లీలో రూ.66.14, కోల్‌కత్తాలో లీటర్ డీజీల్ కు 68.68. ముంబైలో రూ. 70.43, చెన్నైలో లీటర్ డీజీల్ రూ. 69.79 చేరుకొంది.

English summary
Petrol and diesel priced were hiked today, after a gap of 19 days. With that, petrol prices in Delhi registered a fresh high in four years and eight months while diesel prices crossed Rs. 66 per litre for the first time to a new all-time high.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X