హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

స్వల్పంగా పెరిగిన పెట్రో ధరలు: ఏ నరగంలో ఎంతంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: కేంద్రం ప్రభుత్వం పెట్రో ధరలపై రూ.2.5 తగ్గించినప్పటికీ ధరల పెరుగుదల కొనసాగుతుండటంతో వాహనదారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం కూడా ఈ ధరలు మరికాస్త పెరిగాయి.

దేశ రాజధాని ఢిల్లీలో లీటర్‌ పెట్రోల్‌ ధర 18పైసలు పెరిగి రూ. 82.66కు చేరింది. ఇక ధరలు అత్యధికంగా ఉండే ముంబైలో లీటర్‌ పెట్రోల్‌ ధర రూ. 88.12గా ఉంది. కోల్‌కతాలో రూ. 84.48, చెన్నైలో రూ. 85.92గా ఉంది. హైదరాబాద్‌లోనూ పెట్రోల్‌ ధర రూ. 88మార్క్‌కు మరింత చేరువైంది. శనివరం నగరంలో లీటర్‌ పెట్రోల్‌ రూ. 87.63గా ఉంది.

Petrol, diesel prices increase in Delhi, Mumbai

ఇక డీజిల్‌ ధర కూడా నేడు 29-31 పైసలు పెరిగింది. దీంతో ఢిల్లీలో లీటర్‌ డీజిల్‌ ధర రూ. 75.19కు చేరగా.. ముంబైలో రూ. 78.82, కోల్‌కతాలో రూ. 77.04, చెన్నైలో రూ. 79.51, హైదరాబాద్‌లో రూ. 81.79గా ఉంది. కాగా, రూపాయి పతనం, ముడిచమురు ధరలు పెరగడం, అధిక సుంకాల కారణంగా గత కొంతకాలంగా దేశీయంగా ఇంధన ధరలు ఆకాశాన్నంటుతున్నాయి.

English summary
Petrol and diesel prices in Delhi are Rs 82.66 per litre (increase by Rs 0.18) and Rs 75.19 (increase by Rs 0.29) respectively on Saturday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X