వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కర్నాటక ఎన్నికల ఎఫెక్ట్: 6 రోజులుగా మారని పెట్రోల్, డీజిల్ ధరలు

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గత కొద్ది రోజులుగా పెట్రోలు, డీజిల్ ధరల్లో రోజువారి మార్పులు వచ్చాయి. అయితే ఆరు రోజులుగా ఈ ధరల్లో మార్పు లేదు. అందుకు కర్నాటక అసెంబ్లీ ఎన్నికలే కారణమని భావిస్తున్నారు. దేశీయ చమురు సంస్థలు గత మంగళవారం నుంచి ధరల్లో ఎలాంటి మార్పులు చేయలేదు.

ఢిల్లీలోని ఇండియన్‌ ఆయిల్‌ పెట్రోల్‌ బంకుల్లో గత మంగళవారం పెట్రోల్‌ ధర లీటర్‌కు రూ. 74.63, డీజిల్‌ ధర రూ. 65.93గా ఉంది. అప్పటి నుంచి ఈ ధరలు అలాగే ఉన్నాయి. అంతర్జాతీయంగా చమురు ధరల్లో మార్పులు ఉన్నప్పటికీ దేశీయ చమురు సంస్థలు ధరలను సవరించడం లేదు. కర్నాటక ఎన్నికల నేపథ్యంలో ధరలు పెంచవద్దని ప్రభుత్వం కోరినట్లుగా తెలుస్తోంది.

Petrol, Diesel Prices Kept Unchanged For Sixth Day. What You Pay Now

సాధారణంగా ఎన్నికలకు ముందు ఏ ప్రభుత్వమైనా చమురు సంస్థలకు ఇలాంటి ఆదేశాలివ్వడం సాధారణమే. ఇదిలా ఉండగా, ఇటీవలే చమురు‌ ధరలు నాలుగేళ్ల గరిష్ఠానికి చేరాయి. అంతర్జాతీయ పరిణామాలతో పాటు రోజువారి సవరణలతో ధరలు గరిష్ఠంగా పెరిగాయి.

English summary
State oil companies have not revised prices of petrol and diesel for almost a week in an apparent suspension of their freedom to alter prices daily in line with fluctuations in international fuel and exchange rates.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X