వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సామాన్యుడిపై మరో పోటు : భారీగా పెరగనున్న పెట్రో ధరలు

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ : బడ్జెట్ ఎప్పుడు ప్రవేవపెడతాయని ఎదురుచూశాయో ఏమో చమురు సంస్థలు. పార్లమెంట్‌లో పెట్రో, డిజీల్ ధరలు పెరుగుతాయని ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించి కొన్ని గంటలవుతుందో లేదో .. వాయువేగంతో స్పందించాయి. పెట్రోల్, డిజీల్‌పై సెస్ వేస్తూ సామాన్యుడికి పన్ను పోటు పొడిచాయి. పెట్రోల్‌పై రూ.250, డిజీల్‌పై రూ.230 పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. దీంతో సామాన్యుడు ఊసురుమంటున్నాడు. ఇంట్లోంచి వాహనం బయటకు తీయాలంటేనే భయపడే పరిస్థితి వచ్చిందని వాపోతున్నాడు.

పెట్రో పోటు ..

పెట్రో పోటు ..

సామాన్యుడిపై మరో భారం పడింది. వాహనదారులు నిత్యవసర వస్తువులా మారిన పెట్రోల్‌పై పోటు పొడిచారు. బడ్జెట్‌లో సెస్ వేయడంతో లీటర్ పెట్రోల్‌పై రూ.2.50, డిజీల్‌పై రూ.2.30 పోటు పడింది. పెట్రోల్‌పై రూపాయి మౌలిక సదుపాయాల సెస్, మరో రూపాయి ఎక్సైజ్ సుంకం విధించారు. ఈ పన్నులకు అదనంగా వ్యాట్ కలిపినప్పుడు లీటర్ పెట్రోల్ ధర రెండున్నర, డిజీల్ ధర రెండు రూపాయల 30 పైసలుగా ఉంది. దీంతో ప్రభుత్వానికి రూ.28 కోట్ల ఆదాయం సమకూరుతుందని విత్త మంత్రి నిర్మలా సీతారామన్ అంచనా వేశారు.

క్రూడ్ ఆయిల్‌పై కూడా ..

క్రూడ్ ఆయిల్‌పై కూడా ..

క్రూడ్ ఆయిల్‌పై టన్నుకు రూపాయి చొప్పున దిగుమతి సుంకాన్ని వేశారు. 220 మిలియన్ టన్నుల క్రూడాయిల్‌ను భారత్ ప్రతీ ఏడాది దిగుమతి చేసుకుంటుంది. దీంతో ప్రభుత్వానికి అదనంగా రూ.22 కోట్ల ఆదాయం సమకూరుతుంది. శుక్రవారం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ.70..51గా, ముంబైలో 76.15గా ఉంది. డిజీల్ ఢిల్లీలో రూ.64.33గా, ముంబైలో 67.40గా ఉంది.

పైపైకి పసిడి ..

పైపైకి పసిడి ..

పెట్రో ఉత్పత్తులే కాదు జువెల్లరీ, బంగారు ఆభరణాలు మరింత ప్రియం కానున్నాయి. ఇప్పటికే బంగారం ధర పైపైకి వెళ్తున్న సంగతి తెలిసిందే. సాధారణంగా పండుగలు, పెళ్లిళ్ల సమయంలో బంగారం ధర ఆకాశాన్నంటుతుంది. ఈ క్రమంలో బంగారం దిగుమతి పన్నును 10 శాతం నుంచి 12.5 శాతానికి వేశారు. దీంతో బంగారం కొనాలంటే సామాన్యుడు ఒకటికి రెండుసార్లు ఆలోచించాల్సిందే. దీంతోపాటు రక్షణరంగానికి 3.05 ట్రిలియన్ రూపాయల బడ్జెట్ కేటాయించారు. ఇది ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌లో కేటాయించిన మొత్తం .. అయితే సైనిక సిబ్బంది కోసం కొనుగోళ్ల చేసే పరికరాలపై మాత్రం ప్రభుత్వం రాయితీ కల్పిస్తోంది. ఎక్కువ, మద్యస్తంగా సంపాదించేవారికి పన్నుపోటు వేశారు. ఆటో స్పేర్స్ పార్ట్స్ కూడా పన్నును 5 శాతం నుంచి 12 శాతానికి పెంచారు. దీంతో ఆటో ఓనర్లపై విడిభాగాల విక్రయం భారం పడబోతుంది.

English summary
within hours of the Union Budget announcing a hike in cess on auto fuel prices, petrol prices shot up by Rs 2.50/litre while diesel prices have gone up by Rs 2.30/litre.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X