వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఆల్ టైం హైకి పెట్రో, డీజిల్ ధరలు.. 2018 తర్వాత ఇదే తొలిసారి.. వ్యాక్సిన్ రావడం కూడా..

|
Google Oneindia TeluguNews

పెట్రో, డీజిల్ ధరలు మరోసారి పెరిగాయి. వారంలో ధరలు నాలుగోసారి హై అయ్యాయి. లీటర్ పెట్రోల్, డీజిల్ ధర రూ.25 పైసల చొప్పున ఎక్కువయ్యాయి. ఈ మేరకు చమురు సంస్థలు ప్రకటించాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర రూ.85.70కు చేరింది. ముంబైలో అదీ 92.28గా ఉంది. ఢిల్లీలో లీటర్ డీజిల్ ధర రూ.75.88 కాగా.. ముంబైలో 82.66గా ఉంది.

వరసగా రెండో రోజు

వరసగా రెండో రోజు

పెట్రో ధరలు వరసగా రెండోరోజు పెరిగాయి. ఈ వారంలో ఇదీ నాలుగోసారి కావడం విశేషం. దీంతో వారంలో లీటర్ పెట్రోల్ రూ.1 వరకు పెరిగాయి. స్థానిక అమ్మకపు పన్ను/ వ్యాట్ బట్టి రాష్ట్రాలవారీగా ఇంధన ధరలు మారుతున్నాయి. దేశంలో రికార్డు స్థాయికి ఇంధన ధరలు చేరాయి. వినియోగదారులపై భారాన్ని తగ్గించాలని ఎక్సైజ్ సుంకాన్ని తగ్గించాలని డిమాండ్ వస్తోంది.

క్లీవేజ్ షోతో సెగలు.. కరిష్మా తన్నా అందాల విందు

ధరలు పెరుగుదల

ధరలు పెరుగుదల

కరోనా వైరస్ వల్ల గత ఫిబ్రవరి/ మార్చి నుంచి సౌదీ అరేబియా 1 మిలియన్ బ్యారెల్ కోత విధిస్తూ వస్తోంది. దీంతో పెట్రోల్, డీజిల్ ధర పెరుగుతోంది. పెట్రో ధరలను ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్, భారత్ పెట్రోలియం కార్పొరేషన్, హిందుస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ జనవరి 6వ తేదీన ధరలను సవరించింది. దాదాపు నెలరోజుల తర్వాత మరోసారి సవరించడంతో.. చమురు కొరత వల్ల ధరలు పెంచాల్సి వస్తోంది. దీంతో పెట్రోల్‌పై రూ.1.99, డీజిల్‌పై 2.01 పెరిగాయి.

వ్యాక్సిన్ వచ్చిన తర్వాత...

వ్యాక్సిన్ వచ్చిన తర్వాత...

కరోనా వైరస్‌కు వ్యాక్సిన్ వచ్చిన తర్వాత పెట్రో ధరలు పెరిగాయి. భారత్/ ఇతర దేశాల్లో వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన సంగతి తెలిసిందే. దీంతో చమురు ధరలు పెరిగి.. పెట్రో ధరల ఆల్ టైం హైకి చేరాయి. ఈ నెలలో పెట్రో ధరలు గరిష్ట స్థాయికి చేరగా.. ఇదివరకు అక్టోబర్ 4.. 2018లో కూడా పెరిగాయి.

English summary
Petrol and diesel prices in the country on Saturday touched new all-time highs after rates were increased for the fourth time this week.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X