విజయవాడ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మరోసారి తగ్గిన పెట్రోల్ ధరలు: ఏ సిటీలో ఎంతంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: వరుసగా 13 రోజులపాటు తగ్గిన పెట్రోల్ ధరలు.. అక్టోబర్ 31న కాస్త విరామం ఇచ్చి. గురువారం మరోసారి తగ్గాయి. అంతర్జాతీయంగా ముడిచమురు ధరలు తగ్గడంతో దేశీయంగా కూడా ఇంధన ధరలు దిగి వస్తున్నాయి. దీంతో వాహనదారులకు మరింత ఊరట లభించినట్లయింది.

అయితే పెట్రోలు ధరలను తగ్గించిన ఆయిల్‌ కంపెనీలు డీజిల్ ధరల్లో మాత్రం ఎలాంటి మార్పులు చేయలేదు. ప్రస్తుత తగ్గింపుతో వాణిజ్య రాజధాని ముంబైలో 16 పైసలు తగ్గిన పెట్రోలు లీటరు ధర రూ.84.86గా ఉండగా, డీజిల్ ధర రూ.77.32 వద్ద ఉంది. ఢిల్లీలో 16 పైసలు తగ్గిన పెట్రోలు ధర రూ.79.39. డీజిల్ ధర రూ.73.78 వద్ద కొనసాగుతోంది.

మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు: ఎంతంటే?మళ్లీ పెరిగిన ఎల్పీజీ సిలిండర్ ధరలు: ఎంతంటే?

హైద‌రాబాద్‌లో లీట‌ర్ పెట్రోల్ ధర 19 పైసలు తగ్గి రూ.84.14 పలుకుతోంది. డీజిల్ ధర రూ.80.25 గా ఉంది. విజయవాడలో పెట్రోల్‌ ధర రూ.83.29 , డీజిల్‌ ధర రూ.78.97 వద్ద కొనసాగుతోంది. బెంగళూరులో పెట్రోలు ధర లీటరుకు రూ .79.99. డీజిల్‌ ధర రూ.74.16.

Petrol, diesel prices witness dip across India: Check rates here

కోల్‌కతాలో లీటరు పెట్రోలు ధర రూ. 81.25. డీజిల్‌ ధర రూ. 75.63.
చెన్నైలో పెట్రోలు ధర రూ. 82.65 గాను, డీజిల్‌ ధర లీటరుకు78 రూపాయలుగాను ఉంది. అంతర్జాతీయ మార్కెట్‌లో బ్రెంట్ క్రూడ్ ఆయిల్ ధర 75 డాలర్ల దిగువకు పడిపోయింది. క్రూడాయిల్ ధర 74.73 డాలర్లకు చేరింది.

English summary
The fuel prices across the country were facing a continuous increase over the last few months - up until two weeks ago, when the price started going down after the Central and State Governments began their efforts to reduce fuel prices.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X