వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మళ్లీ పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు: హైదరాబాద్ సహా ఏయే నగరాల్లో ఎంత పెరిగిందంటే.?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: రోజు రోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలతో కేంద్రంపై ప్రతిపక్షాలు ముప్పేటదాడి చేస్తున్నాయి. ఇప్పటికే పెరిగిన ఇంధన ధలతో ఆందోళన వ్యక్తం చేస్తున్న వాహనదారులకు మరో చేదు వార్త ఇది. తాజా, మంగళవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగాయి.

 సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లిన రాబర్ట్ వాద్రా: పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన, మోడీపై ఫైర్ సైకిల్‌పై ఆఫీసుకు వెళ్లిన రాబర్ట్ వాద్రా: పెట్రోల్ ధరల పెరుగుదలపై నిరసన, మోడీపై ఫైర్

ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు

ఢిల్లీలో పెట్రోల్, డీజిల్ ధరలు

లీటర్ పెట్రోల్, డీజిల్‌పై 38 పైసల వరకు పెంచాయి. ఇటీవల దేశంలో ఇంధన ధరలు వరుసగా 12 రోజులు పెరిగిన విషయం తెలిసిందే. ఆ వరుస పెరుగుదలకు రెండు రోజులు విరామం ఇచ్చి.. మళ్లీ మంగళవారం ఇంధన ధరలు పెరిగాయి.
ఢిల్లీలో పెట్రోల్, డీజిల్‌పై 35 పైసలు పెంచడంతో లీటర్ పెట్రోల ధర రూ. 90.93గా, డీజిల్ ధర రూ. 81.32గా నమోదైంది.

హైదరాబాద్ నగరంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు

హైదరాబాద్ నగరంలో పెరిగిన పెట్రోల్, డీజిల్ ధరలు


హైదరాబాద్‌లో లీటర్ పెట్రోల్‌పై 36 పైసలు, డీజిల్‌పై 38 పైసలు పెంచాయి. దీంతో హైదరాబాద్ నగరంలో లీటర్ పెట్రోల్ ధర రూ. 94.54, డీజిల్ ధర రూ. 88.69గా నమోదైంది. కాగా, గత 54 రోజుల్లో చుమురు ధరలు 25 సార్లు పెరగడం గమనార్హం. ఈ ఏడాదిలోనే పెట్రోల్, డీజిల్ ధరలు రూ. 7.50 పెరిగియి.

ముంబై, బెంగళూరు నగరాల్లో ఇంధన ధరలు

ముంబై, బెంగళూరు నగరాల్లో ఇంధన ధరలు

ముంబైలో పెట్రోల్, డీజిల్ ధరలపై 37 పైసలు, 38 పైసలు పెరిగాయి. దీంతో దేశ ఆర్థిక రాజధానిలో పెట్రోల్ లీటర్ ధర రూ. 97.34 కాగా, డీజిల్ ధర రూ. 88.44గా ఉంది. ఇక బెంగళూరులో నగరంలో పెరిగిన ధరలతో పెట్రోల్ లీటర్ ధర రూ. 93.98, డీజిల్ లీటర్ ధర రూ. 86.21గా ఉంది.

పెట్రోల్, డీజిల్ ధరలపై పెరుగుదలపై నిరసనలు

పెట్రోల్, డీజిల్ ధరలపై పెరుగుదలపై నిరసనలు

ఇంధన ధరలు వరుసగా పెరుగుదల నమోదు చేయడంతో దేశ వ్యాప్తంగా ప్రతిపక్షాలు ఆందోళనకు దిగుతున్నాయి. ప్రజల జేబులను ఖాళీ చేయడంలో నరేంద్ర మోడీ ప్రభుత్వం బాగా పనిచేస్తోందంటూ కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఇప్పటికే సెటైర్లు వేశారు. క్రూడాయిల్ ధరలు పెరగకున్నా.. పెట్రోల్, డీజిల్ ధరలు పెరగడం ఏంటని ప్రశ్నించారు. ఇక రాబర్ట్ వాద్రా సోమవారం తన కార్యాలయానికి సైకిల్‌పై వెళ్లి ఇంధన ధరల పెరుగుదలకు నిరసన తెలిపారు. సోనియా గాంధీ ప్రధాని మోడీకి లేఖ రాశారు. పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించాలని కోరారు.

English summary
State-run oil marketing companies (OMC) on Tuesday announced a hike in fuel prices, after keeping rates unchanged for two straight days, according to news agency ANI.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X