చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: 18రోజుల్లో తగ్గింపు ఎంతంటే?

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంతో వాహనదారుడికి మరింత ఉపశమనం కలిగింది. గత 18రోజులుగా అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో పెట్రో ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం లీటర్ పెట్రోల్‌పై 22పైసలు తగ్గగా, డీజిల్‌పై 20పైసలు తగ్గింది.

గత 18రోజుల్లో పెట్రోల్ లీటర్ ధరపై మొత్తం రూ.4.05 తగ్గింది. ఇక డీజిల్‌పై రూ. 2.33 తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.78.56 ఉండగా, డీజిల్ ధర రూ.73.16 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.06, డీజిల్ 76.67గా ఉంది.

Petrol price cut by 22 paise; total reduction reaches Rs 4.06 in 19 days

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.81.61 ఉండగా, హైదరాబాద్‌లో 83.30గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ లీటర్ ధర 80.47గా ఉంది. లీటర్ డీజిల్ ధర చెన్నైలో రూ. 77.34కాగా, హైదరాబాద్‌లో 79.60, కోల్‌కతాలో 75.02గా ఉంది.

English summary
Petrol price has been cut by over Rs 4 per litre and diesel by Rs 2.33 in the last 18 days on softer international rates, a pace faster than the spike in prices witnessed in the two-month period beginning mid-August.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X