మళ్లీ తగ్గిన పెట్రోల్, డీజిల్ ధరలు: 18రోజుల్లో తగ్గింపు ఎంతంటే?
న్యూఢిల్లీ: సోమవారం కూడా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గడంతో వాహనదారుడికి మరింత ఉపశమనం కలిగింది. గత 18రోజులుగా అంతర్జాతీయ చమురు ధరలు తగ్గడంతో పెట్రో ధరలు కూడా తగ్గుతూ వస్తున్నాయి. సోమవారం లీటర్ పెట్రోల్‌పై 22పైసలు తగ్గగా, డీజిల్‌పై 20పైసలు తగ్గింది.
గత 18రోజుల్లో పెట్రోల్ లీటర్ ధరపై మొత్తం రూ.4.05 తగ్గింది. ఇక డీజిల్‌పై రూ. 2.33 తగ్గింది. దేశ రాజధాని న్యూఢిల్లీలో సోమవారం లీటర్ పెట్రోల్ ధర రూ.78.56 ఉండగా, డీజిల్ ధర రూ.73.16 ఉంది. ముంబైలో లీటర్ పెట్రోల్ ధర రూ.84.06, డీజిల్ 76.67గా ఉంది.

చెన్నైలో లీటర్ పెట్రోల్ ధర రూ.81.61 ఉండగా, హైదరాబాద్‌లో 83.30గా ఉంది. కోల్‌కతాలో పెట్రోల్ లీటర్ ధర 80.47గా ఉంది. లీటర్ డీజిల్ ధర చెన్నైలో రూ. 77.34కాగా, హైదరాబాద్‌లో 79.60, కోల్‌కతాలో 75.02గా ఉంది.