వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వరుసగా 29వ రోజు తగ్గిన పెట్రోల్ ధరలు, నెల రోజుల్లో రూ.7కు పైగా తగ్గింది

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: గతంలో రోజు రోజుకు పెరిగిన పెట్రోల్ ధరలు, గత కొంతకాలంగా తగ్గుతూ వస్తున్నాయి. ఆదివారం నాడు పెట్రోల్ ధర 20 పైసలు, డీజిల్ ధర 18 పైసలు తగ్గింది. పెట్రోల్ ధరలు వరుసగా 29వ రోజు తగ్గాయి. ఈ నెల రోజుల్లో పెట్రోల్ ధర రూ.7కు పైగా తగ్గింది. ఇది వినియోగదారులకు పెద్ద ఊరట అని చెప్పవచ్చు.

ఢిల్లీలో ఆదివారం పెట్రోలు ధర 20 పైసలు తగ్గి లీటరు రూ.76.71కు చేరింది. డీజిల్ ధర కూడా 18 పైసలు తగ్గి లీటరు రూ.71.56కు వచ్చింది. వరుసగా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గుతుండటం గమనార్హం.

Petrol price down by Rs 7.29 per litre in one month, rates back at mid August levels

గత నెల రోజుల్లో లీటరు పెట్రోలుపై రూ.7.29 తగ్గింది. డీజిల్ పైన రూ.3.89 తగ్గింది. ఆగస్ట్ 16వ తేదీ నుంచి పెరుగుతూ వచ్చిన పెట్రోల్, డీజిల్ ధరలు ఆల్‌టైమ్‌ గరిష్ఠాలకు చేరుకున్నాయి.

అక్టోబరు 4న ఢిల్లీలో లీటరు పెట్రోలు ధర రూ.84 వరకూ చేరుకున్నాయి. ముంబైలో రూ.91.34కు చేరింది. డీజిల్‌ ధర ఢిల్లీలో రూ.75.45వద్ద ఆల్‌టైమ్‌ గరిష్ఠాన్ని నమోదు చేసింది. ముంబైలో రూ.80.10 వద్ద గరిష్ఠ ధరను నమోదు చేసింది. కానీ, అక్టోబరు 18వ తేదీ తర్వాత నుంచి ధరలు తగ్గుతూ వస్తున్నాయి.

English summary
Petrol price Sunday was cut by 20 paise a litre and diesel by 18 paise, the 29th straight daily reduction in rates that has wiped away all of the massive price increase in petrol witnessed in two months since mid-August that had triggered a political uproar. Petrol price in Delhi was cut to Rs 76.71 a litre from Rs 76.91 on Saturday, according to a price notification issued by state-owned fuel retailers.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X