వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెరిగిన పెట్రోల్ ధర, 7 పైసలు తగ్గిన డీజిల్

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోలు ధరలు మరోసారి పెరిగాయి. అదే సమయంలో డీజిల్ ధర మాత్రం తగ్గింది. లీటరు పెట్రోల్ పైన 28 పైసలు పెంచుతూ ప్రభుత్వ రంగ చమురు సంస్థలు నిర్ణయం తీసుకున్నాయి. డీజిల్‌ ధర లీటర్‌కు 6 పైసలు తగ్గింది. ఈ ధరలు శుక్రవారం అర్ధరాత్రి నుంచి అమలులోకి వస్తున్నాయి.

ఇటీవలె పెట్రోలు, డీజిల్ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. అంతకుముందు రెండుసార్లు పెట్రోలు, డీజిల్ ధరలు స్వల్పంగా పెరిగాయి. గత నెల ఎక్కువ పెరిగాయి. ఆగస్టు 31వ తేదీ అర్ధరాత్రిన ధరలు ఎక్కవగా పెరిగాయి. నాడు పెట్రోల్ పైన లీటర్‌కు రూ.3.38 పైసలు, డీజిల్‌పై లీటర్‌కు రూ.2.67 పైసలు పెరిగింది.

Petrol

గత రెండు నెలల్లో పెట్రోల్ ధరలు పెరగడం మూడోసారి. ఈ రోజు అర్ధరాత్రి నుంచి ఢిల్లీలో పెట్రోల్ ధర రూ.64.57 పైసలుగా ఉంటుంది. శుక్రవారం వరకు రూ.64.21 పైసలుగా ఉంది. డీజిల్ రూ.52.52 పైసలుగా ఉంటుంది. శుక్రవారం వరకు డీజిల్ లీటర్ రూ.52.59 పైసలుగా ఉంది.

English summary
Petrol price was on Friday hiked by 36 paise a litre, the third increase in two months, but that of diesel was cut by 7 paise per litre in line with international trends.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X