వేగవంతమైన అలర్ట్స్ కోసం
For Daily Alerts
ధరల పెంపు: పెట్రోల్ 75, డీజిల్ 50 పైసలు

దీంతో పెట్రోల్ ధర ఢిల్లీలో లీటరుకు రూ. 71.50పైసల నుంచి రూ.72.25 పైసలకు పెరుగుతుంది. డీజిల్ ధర ఢిల్లీలో రూ.53.80 పైసల నుంచి రూ.54.30 పైసలకు పెరుగుతుంది. స్థానిక అమ్మకం పన్ను లేదా వ్యాట్ విడిగా ఉంటాయి. ఇందులో కలవవు.
పెట్రోల్ ధరను నిరుడు డిసెంబర్ 20వ తేదీన మార్కెట్ కంపెనీలు పెంచాయి. అప్పుడు లీటరుకు 45 పైసలు పెంచాయి. పెట్రోల్ పంపు డీలర్లకు కమిషన్ను పెంచాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం వల్ల, అంతర్జాతీయ మార్కెట్లో ముడి చమురు ధర వల్ల అప్పుడు పెట్రోల్ ధర పెరిగింది.
అదే సమయంలో డీలర్ల కమిషన్ పెంచడంతో డీజిల్ ధరను లీటరకు అప్పుడు చమురు మార్కెటింగ్ కంపెనీలు లీటరకు 10 పైసలు పెంచాయి.