వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రో మంట: లీటర్ పెట్రోల్ 101.. ఇక్కడే...

|
Google Oneindia TeluguNews

ఇందనం ధర వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. వరుసగా ధర పెరుగుతోంది. లీటరు పెట్రోల్ ధర 100 రూపాయలు దాటేసింది. రాజస్థాన్‌లోని శ్రీగంగానగర్‌లో 38 పైసల పెట్రో ధర పెంపుతో ప్రీమియం పెట్రోల్ ధర లీటరుకు రూ.101.80కు చేరుకుంది. రాజధాని జైపూర్‌లో లీటరు పెట్రోలు ధర రూ .93.86, డీజిల్ ధర 85.94 చేరింది. రాజస్థాన్ వ్యాప్తంగా పెట్రోల్ 93 రూపాయలకు ఎగువన, డీజిల్ ధర రూ.85 కంటే హైగానే ఉంది.

ఇవాళ ఢిల్లీలో సాధారణ పెట్రోలు రూ. 86.30, లీటర్‌ డీజిల్‌ ధర రూ. 76.48 ఉంది. ఇక చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 88.82, డీజిల్‌ ధర రూ. 81.71 ఉంది. హైదరాబాద్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ. 89.77, డీజిల్‌ ధర రూ. 83.46 ఉంది. ఇటు ఆంధ్రప్రదేశ్‌లో పెట్రోలు ధర లీటరుకు రూ. 92.54. డీజిల్‌ ధర రూ. 85.73గా ఉంది.

petrol price rs 101.80 litre rajasthan

వ్యాట్‌లో తేడాల వల్ల ఆయా రాష్ట్రాల్లో పెట్రో ధర డిఫరెంట్‌గా ఉంది. 2020 మేలో రాజస్థాన్ ప్రభుత్వం విడుదల చేసిన అధికారిక నోటిఫికేషన్ ప్రకారం డీజిల్ ధరలపై వ్యాట్ 28 శాతం ఉండగా, పెట్రోల్‌పై వ్యాట్ 38 శాతంగా ఉంది. పొరుగు రాష్ట్రాల్లో పెట్రోల్‌పై 20 శాతం నుంచి 33 శాతం, డీజిల్‌పై 16 శాతం నుంచి 23 శాతం వ్యాట్‌ అమల్లో ఉంది. రాజస్థాన్‌లో ఇతర రాష్ట్రాల కంటే పెట్రోల్, డీజిల్ 4-8 నుంచి 10-11 రూపాయలు ఎక్కువగా ఉంది.

English summary
petrol price rs 101.80 litre rajasthans sri ganganagar due to vat taxes.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X