వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

మోడీకి మింగుడు పడట్లేదుగా: రామరాజ్యం కంటే రావణ లంకే బెటర్: రాముడి పేరుతో పెంపు: బీజేపీ ఎంపీ

|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా పెట్రోల్, డీజిల్ ధరలు రాకెట్లా దూసుకెళ్తోన్న వేళ.. వాహనదారులకు ఉపశమనం కలిగించేలా ప్రతిపాదనలేవైనా చేస్తారంటూ సామాన్యుడు ఆశలు పెట్టుకున్న సందర్భంలో.. దానికి బదులుగా వాటి రేట్లు మరింత పెంచేలా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న చర్యలు ఓ పట్టాన మింగుడు పడట్లేదు. పెట్రోల్, డీజిల్ రేట్లు మరింత పెరిగేలా కేంద్ర ప్రభుత్వం బడ్జెట్‌లో అగ్రిసెస్‌ను విధించడాన్ని జీర్ణించుకోలేకపోతోన్నారు. చివరికి- భారతీయ జనతా పార్టీకి చెందిన కొందరు నేతలు సైతం ఈ ప్రతిపాదనలను వ్యతిరేకిస్తున్నారు.

మోడీ సర్కార్ యమ స్పీడ్: పాత వాహనాల చిట్టా రెడీ చేసిన గడ్కరీ: తుక్కు కిందికి 67 లక్షలకు పైగామోడీ సర్కార్ యమ స్పీడ్: పాత వాహనాల చిట్టా రెడీ చేసిన గడ్కరీ: తుక్కు కిందికి 67 లక్షలకు పైగా

పెట్రోల్, డీజిల్ ధరల పెరుగుదల ప్రభావం క్షేత్రస్థాయిలో తీవ్రంగా ఉంటుందంటూ ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. ఈ పరిణామాల మధ్య బీజేపీకి చెందిన రాజ్యసభ సభ్యుడు సుబ్రహ్యణ్య స్వామి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకుంటున్నాయి. రాజకీయ దుమారానికి కారణమౌతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు బీజేపీని విమర్శించడానికి కేంద్రబిందువు అవుతున్నాయి. శ్రీరామచంద్రుడు జన్మించిన భారత్‌లో పెట్రోల్ రేటు లీటర్ ఒక్కింటికి 93 రూపాయలు పలుకుతోందని, అదే సీతమ్మ తల్లి జన్మించిన నేపాల్‌లో కేవలం 53 రూపాయలేనని సుబ్రహ్యణ్య స్వామి పేర్కొన్నారు.

Petrol price Rs 93 in Lord Sri Ram’s India, Rs 51 in Ravan’s Lanka

రావణాసురుడు ఏలిన శ్రీలంకలో పెట్రోల్ 51 రూపాయలకే దొరుకుతోందని అన్నారు. దీనికి సంబంధించిన ఓ స్లైడ్‌ను ఆయన తన అధికారిక ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఈ కామెంట్స్‌కు నెటిజన్ల నుంచి పెద్ద ఎత్తున స్పందన లభిస్తోంది. ఇక రామరాజ్యం ఎక్కడ ఉన్నట్లు? అని ఆయన నెటిజన్లు ప్రశ్నించారు. రామరాజ్యం కంటే రావణుడు పరిపాలించ లంక లేదా. సీతమ్మ జన్మించిన నేపాల్ బెటర్ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. పెట్రోల్, డీజిల్‌పై కొత్తగా విధించిన అగ్రిసెస్‌ ద్వారా అందిన అదనపు నిధులను కేంద్ర ప్రభుత్వం దారి మళ్లించే అవకాశాలు లేకపోలేదంటూ మండిపడుతున్నారు.

నైనా గంగూలీ అందాల ఆరబోత.. కెమెరా ముందు గ్లామర్‌తో రెచ్చిపోయిన యువ బ్యూటీ

రైతాంగం పేరును అడ్డుగా పెట్టుకుని వాహనదారులపై పెను భారాన్ని మోపుతున్నారని విమర్శిస్తున్నారు. మూడు వ్యవసాయ బిల్లులకు నిరసనగా రైతులు ఢిల్లీలో ట్రాక్టర్ ర్యాలీ చేపట్టడం వల్లే డీజిల్‌పై నాలుగు రూపాయల మేర అగ్రిసెస్ విధించినట్లు కనిపిస్తోందంటూ చురకలు అంటిస్తున్నారు. రైతులు చేపట్టిన ట్రాక్టర్ ర్యాలీ నిరసనలను దృష్టిలో ఉంచుకుని.. ఇలా డీజిల్ రేట్లు పెంచేశారని, ఇదెక్కడి రామరాజ్యం అంటూ పలువురు నెటిజన్లు ట్వీట్లు చేస్తున్నారు. సోషల్ మీడియాలో తమ కామెంట్లను పోస్ట్ చేస్తున్నారు.

Recommended Video

Union Budget 2021 : కొత్త బడ్జెట్‌ ద్వారా ఎవరికి ప్రయోజనం ? ఎవరెవరికి నష్టం ? పూర్తి వివరాలివే!

English summary
A day after Union Budget 2021, Rajya Sabha MP Subramanian Swamy posted a photo on Twitter comparing India’s fuel prices with that of neighbouring Nepal and Sri Lanka. Swamy who is known for no-nonsense approach when it comes to expressing his views wrote.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X