వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

దేవుడా.. ముంబైలో మళ్లీ రూ.80 దాటిన పెట్రోల్, డీజిల్ రూ.68 పైనే!

By Ramesh Babu
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్ ధరలు రికార్డుల మోత మోగిస్తూనే ఉన్నాయి. బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత నుంచి గరిష్ట స్థాయిల్లో ఈ ధరలు సోమవారం నమోదయ్యాయి. సోమవారం లీటరు పెట్రోల్‌ ధర 15 పైసలు, లీటరు డీజిల్‌ ధర 7 పైసలు పెరిగింది.

దీంతో ముంబైలో పెట్రోల్‌ ధర మరోసారి రూ.80 మార్కును అధిగమించి, రూ.81.17గా నమోదవుతోంది. డీజిల్‌ రూ.68.30గా ఉంది. ముంబైలో స్థానిక పన్ను లేదా వ్యాట్‌ రేట్లు అత్యధికంగా ఉండటంతో అక్కడ పెట్రోల్, డీజిల్ ధరలు మండిపోతున్నాయి.

Petrol prices cross Rs 80-mark in Mumbai, Diesel at Rs 68.30

ఇక ఢిల్లీలో 2014 మార్చి నుంచి అత్యంత గరిష్ట స్థాయిల్లోకి పెట్రోల్‌ ధర ఎగిసింది. సోమవారం లీటరు పెట్రోల్‌ ధర ఢిల్లీలో రూ.73.31గా, డీజిల్‌ ధర రూ.64.14గా రికార్డయ్యాయి.
డిసెంబర్‌ మధ్య నుంచి లీటరు పెట్రోల్‌ ధర కనీసం రూ.4, డీజిల్‌ ధర రూ.5.77 మేర పెరిగాయి.

పెట్రోల్‌, డీజిల్‌ ధరలు భారీగా పెరుగుతుండటంతో.. ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ బడ్జెట్‌లో వీటిపై రెండు రూపాయల ఎక్సైజ్‌ డ్యూటీ తగ్గించారు. కానీ స్థానిక పన్నుల్లో ఎలాంటి మార్పు లేకపోవడంతో, ధరలు పైకి ఎగుస్తూనే ఉన్నాయి.

రెండు రూపాయల మేర ఎక్సైజ్‌ డ్యూటీని తగ్గించిన ప్రభుత్వం, కొత్తగా పెట్రోల్‌, డీజిల్‌పై లీటరుకు 8 రూపాయల మేర రోడ్డు, మౌలిక సదుపాయాల సెస్‌ను విధించింది. ఒకవైపు అంతర్జాతీయ ముడిచమురు ధరలు ప్రస్తుతం తగ్గుతున్నా దేశీయంగా పెట్రోల్, డీజిల్ ధరలు మాత్రం తగ్గడం లేదు.

English summary
Petrol prices on Monday hit the highest level since the BJP government came to power in 2014. Petrol prices were hiked by 15 paise and diesel prices were hiked by 7 paise per litre, applicable from 6:00 a.m. on 5th February 2018. In Mumbai, prices have crossed Rs 80-mark - costliest in the country. Diesel is being sold at Rs 68.30 in Mumbai, where the local sales tax or VAT rates are higher while petrol is being sold at Rs 81.17. Petrol price rose to Rs 73.31 per litre in Delhi, highest since March 2014, while diesel price rose to Rs 64.14 per litre in Delhi. Petrol price has risen by almost 4 per litre since mid- December, while diesel jumped Rs 5.77 a litre. Finance Minister Arun Jaitley has rejiged excise duty on petrol and diesel but kept the total tax incidence unchanged, belying expectations of a cut in rates to cushion rising prices.In his Budget proposals for 2018-19, Jaitley lowered basic excise duty on petrol and diesel by Rs 2 per litre each to Rs 4.48 and Rs 6.33 a litre, respectively.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X