వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

షాక్: భారీగా పెరగనున్న పెట్రోల్, లీటర్‌కు రూ.300, ఎందుకంటే?

By Narsimha
|
Google Oneindia TeluguNews

Recommended Video

Petrol Prices May Touch Rs 300 Per Litre

న్యూఢిల్లీ: పెట్రోల్ ధరలు ఇండియాలో రూ. 300 చేరుకొనే అవకాశాలు లేకపోలేదని మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు. అంతర్జాతీయంగా చోటు చేసుకొంటున్న మార్పులు పెట్రోల్ ధరలపై ప్రభావం చూపే అవకాశం ఉన్నాయని నిపుణులు చెబుతున్నారు.

ఇప్పటికే ఇండియాలో పెట్రోల్, డీజీల్ ధరలు ఇతర దేశాలతో పోలిస్తే ఎక్కువగా ఉన్నాయి. ఈ తరుణంలో అంతర్జాతీయంగా చోటు చేసుకొంటున్న మార్పులు ఇండియాలో మరింత ధరలు పెరిగే అవకాశం ఉందనే వార్త వినియోగదారుల గుండెల్లో గుబులు రేపుతోంది.

లీటర్ పెట్రోల్ ధరలు కనీసం రూ. 70 దాటితేనే ఇతర దేశాలతో పోలిస్గే ఇండియాలో ఈ ధరలు ఎక్కువనే అభిప్రాయాలు కూడ లేకపోలేదు. అంతర్జాతీయ సమాజంలో చోటు చేసుకొంటున్న మార్పులతో ఇండియాలో లీటర్ పెట్రోల్ ధర రూ.300 తాకే అవకాశం లేకపోలేదు.

లీటర్ పెట్రోల్ ధర రూ. 300

లీటర్ పెట్రోల్ ధర రూ. 300

మధ్యప్రాచ్యంలో మొదలైన ప్రచ్ఛన్న యుద్దం సమీప రోజుల్లో భారత్‌పై తీవ్ర ప్రతికూల ప్రభావాలను చూపేలాకన్పిస్తున్నాయి. ఈ పరిణామాలతో ఇండియాలో ఇంధన ధరలకు రెక్కలు వచ్చేలా కనిపిస్తున్నాయి. మధ్యప్రాచ్యంలో అత్యంత బలమైన ఇరాన్‌, సౌదీ అరేబియాలు.. ముడి చమురు ధరను భారీగా పెంచేలా కనిపిస్తున్నాయి. ఇంధన ధరలు పెరిగే అవకాశాలున్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఎవరూ ఊహించని స్థాయిలో పెరిగే ఇంధన ధరల వల్ల మధ్యతరగతి కుటుంబాలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉంది. లీటర్ పెట్రోల్ ధర రూ. 300 వరకు పెరిగే అవకాశం ఉందని నిపుణులు అంచనా విశ్లేషిస్తున్నారు.

ఆయిల్ డిమాండ్ 500 శాతం పెరిగే అవకాశం

ఆయిల్ డిమాండ్ 500 శాతం పెరిగే అవకాశం

సౌదీ అరేబియా, ఇరాన్‌లు ముడి చమురును అధికంగా ఎగుమతి చేస్తాయి. ఈ రెండు దేశాల మధ్య యుద్దం జరిగే పరిస్థితులు ఎదురైతే ఆయిల్ డిమాండ్‌పై తీవ్ర ప్రభావం చూపే అవకాశం లేకపోలేదని నిపుణులు చెబుతున్నారు.అదే జరిగితే లీటర్ పెట్రోల్ ధర రూ. 70 500 శాతానికి పెరిగి రూ. రూ. 300 చేరుకొనే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు.

లెబనాన్ కారణంగా యుద్దమా

లెబనాన్ కారణంగా యుద్దమా

రియాద్‌, టెహ్రాన్‌ మధ్య చాలాకాలంగా ప్రచ్ఛన్నయుద్ధం నడుస్తోంది. అయితే లెబనాన్‌పై ఇరాన్ ఆధిపత్యం ఉందంటూ ఆ దేశ ప్రధాని సాద్‌ హారరీ.. సౌదీ అరేబియాలో ప్రకటించి తన పదవికి రాజీనామా చేశారు. అంతేకాక ఇరాన్‌ వల్ల తనకు ప్రాణహానీ ఉందంటూ ప్రకటించారు. లెబనాన్‌ వెళ్లిన తరువాత.. మళ్లీ కనిపించకుండా పోయారు. దీంతో లెబనాన్‌లో తీవ్ర సంక్షోభ పరిస్థితులు తలెత్తాయి.

తీవ్ర ఉద్రిక్తతలు

తీవ్ర ఉద్రిక్తతలు

మధ్యప్రాచ్యంలో బలమైన ఆర్థిక దేశాలు రెండూ ఆయిల్‌ మార్కెట్‌ను అతలాకుతలం చేస్తున్నాయి. ఇటీవల చోటు చేసుకొంటున్న మార్పులు పెట్రోల్ ధరలపై ప్రభావం చూపే అవకాశాలున్నాయనే అభిప్రాయాలను విశ్లేషకులు వ్యక్తం చేస్తున్నారు.సౌదీ అరేబియా, ఇరాన్‌లు దశాబ్దాలుగా మధ్య ప్రాచ్యంపై ఆధిపత్యం కోసం పోరాటాలు చేస్తూనే ఉన్నాయి.

English summary
Petrol price in India may rise to Rs 300 per litre following an ever-possible war between the two oil-rich countries of the Middle East. There would be a sharp rise in crude oil prices in the global market if Saudi Arabia and Iran indulged in a full-blown military confrontation in a bid to become the most dominant country in the Middle East. The effect will also appear in India and petrol price would go all-time high. Such increase in petrol prices will have adverse effects on the livelihood of middle-class families.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X