హైదరాబాద్ వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

రూ.88.26: వివిధ నగరాల్లో పెరిగిన పెట్రోల్ ధరలివే, ఏపీ, రాజస్థాన్‌లో స్వల్పంగా తగ్గింపు

By Rajashekhar
|
Google Oneindia TeluguNews

Recommended Video

ఏపీ, రాజస్థాన్‌లో స్వల్పంగా పెట్రోల్ ధర తగ్గింపు

ముంబై: దేశంలో పెట్రోల్‌, డీజిల్‌ ధరలు రోజు రోజుకీ పెరిగిపోతూనే ఉన్నాయి. మంగళవారం పెట్రోల్‌ ధర లీటరుకు 14 పైసలు, డీజిల్‌పై 15 పైసలు పెరిగింది. దిల్లీలో లీటరు పెట్రోల్‌ ధర రూ.80.87, డీజిల్‌ ధర రూ.72.97గా ఉంది.

ముంబైలో అత్యధికంగా లీటర్ పెట్రోల్‌ ధర రూ.88.26, డీజిల్‌ రూ.77.47కి చేరుకుంది. చెన్నైలో పెట్రోలు ధర లీటరుకు రూ. 84.05, ధర రూ. 77.13గా ఉంది. కోలకతాలో పెట్రోలు, డీజిల్ ధరలు 14 పైసలు పెరిగి 83.75, 75.82 రూపాయలకు చేరింది.

పన్ను తగ్గింపు: ఏపీ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త, భారం రూ.1120కోట్లుపన్ను తగ్గింపు: ఏపీ వాహనదారులకు చంద్రబాబు శుభవార్త, భారం రూ.1120కోట్లు

Petrol prices soars high, Rs 88.26 per litre in Mumbai: Check today’s rate

హైదరాబాద్ లో మంగ‌ళవారం లీటర్ పెట్రోలు ధర రూ. 85.60 కాగా లీటర్ డీజిల్ ధర రూ.79.22గా ఉంది. పెట్రోల్ ధ‌ర 25 పైస‌లు, డీజిల్ ధ‌ర 24 పైసలు పెరిగింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్‌ ధరలపై రూ.2 తగ్గించింది. దీంతో సోమవారం నాటి ధరలతో పోలిస్తే స్వల్పంగా తగ్గాయి. అలాగే రాజస్థాన్‌ సర్కార్‌ కూడా 4 శాతం వ్యాట్‌ను తగ్గిస్తున్నట్టు వెల్లడించింది. పెట్రోల్, డీజిల్‌ లీటరు ధరలపై రూ.2 .50 తగ్గిస్తూ వసుంధరా రాజే సర్కార్ నిర్ణయం తీసుకున్న సంగతి తెలిసిందే.

కాగా, పెరుగుతున్న పెట్రో ధరలపై ప్రజలు గగ్గోలు పెడుతున్నా, 22 రాజకీయ పార్టీలు భారత్‌ బంద్‌కు పిలుపునిచ్చినా కేంద్రం ఏ మాత్రం పట్టనట్లుగా వ్యవహరిస్తోందని స్వరత్రా విమర్శలు వస్తున్నాయి. అయితే, పెట్రో ధరల పెంపునకు అంతర్జాతీయ పరిణామాలే కారణమని కేంద్రం చెబుతున్న కేంద్రం... ఎక్సైజ్‌ సుంకం తగ్గిస్తే ఆర్థిక వ్యవస్థకు ప్రమాదమని చెబుతోంది.

English summary
Petrol prices soared to fresh record high on Tuesday across the four metros. The revised rates are applicable from 6 am from today.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X