వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లీటర్ పెట్రోల్‌పై 15, డీజిల్‌పై 17 పైసలు, వరుసగా ఐదోరోజు పెరిగిన పెట్రోల్ ధరలు

|
Google Oneindia TeluguNews

పెట్రోల్, డీజిల్ ధరలు వరుసగా ఐదో రోజు పెరిగాయి. లీటర్ పెట్రోల్‌పై 15 పైసలు, డీజిల్‌పై 17 పైసలు పెంచుతున్నట్టు చమురుసంస్థలు సోమవారం ప్రకటించాయి. ఇరాన్ మిలిటరీ టాప్ కమాండర్ మేజర్ జనరల్ సొలెమని అమెరికా సేనలు మట్టుబెట్టడంతో క్రూడయిల్ ధర 70 అమెరికా డాలర్లకి చేరింది. దీంతో ఆయా దేశాల్లో పెట్రో ఉత్పత్తలు ధరలు పెరుగుతూనే ఉన్నాయి.

లీటర్ పెట్రోల్‌కి 15 పైసలు పెరగడంతో ఢిల్లీలో 75.69 పైసలకు చేరింది. గతేడాది 2018 నవంబర్ నుంచి ఢిల్లీలో పెట్రో ధరలు పెరగడం ఇదే తొలిసారి. అలాగే డీజిల్ ధర కూడా 68.68కి చేరింది. మధ్యప్రాచ్యలో ఉద్రిక్తతతో పెట్రో ఉత్పత్తుల ధరలు పెరుగుతూనే ఉన్నాయి. ఇటు బంగారం ధర కూడా పెరగడం విశేషం. ఆరేళ్లలో గోల్డ్ రేట్ గరిష్టానికి చేరింది. సౌదీలో పెట్రో ఉత్పత్తులపై గతేడాది సెప్టెంబర్‌లో దాడులు జరిగిన తర్వాత.. చమురు ధరలు పెరగడం ఇదే మొదటిసారి.

Petrol prices up 15 paisa, diesel by 17 paisa as crude hits dollar 70 mark

చమురు ఉత్పత్తుల ధరలు పెరగడం స్టాక్ మార్కెట్లపై కూడా ప్రభావం చూపింది. జపాన్ నుంచి హంకాంగ్ వరకు మార్కెట్లు పడిపోయాయి. సోమవారం బీఎస్ఈ సెన్సెక్స్ 787.98 పాయింట్లు నష్టపోయి 40,676.63కి చేరింది. నిఫ్టీ 233.60 పాయింట్లు నష్టపోయి 11.933.05కి చేరింది.

అంతర్జాతీయ స్థాయిలో ధరల ఆధారంగా పెట్రోల్, డీజిల్ ధరలను ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు రోజువారీగా సమీక్షిస్తాయి. ఇండియన్ ఆయిల్ కంపెనీ ధరను సమీక్షించి, నిర్ణయించడంతో మరుసటి రోజునుంచి కొత్త ధరలు అమల్లోకి వస్తాయి. 2017 జూన్ నుంచి ఆయిల్ సంస్థలు రోజువారీ ధరలను సమీక్షించే అధికారం కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టింది. దీంతో రోజువారీగా సమీక్షించి, పెంచుతూ, తగ్గిస్తూ ఉన్నాయి.

English summary
petrol prices on Monday were hiked by 15 paisa a litre and diesel rates were increased by 17 paisa.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X