వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

పెట్రోల్ ట్యాంకర్‌లో మంటలు : ప్లై ఓవర్ మీద ఎగిసిపడ్డ జ్వాల, ఆందోళనకు గురైన వాహనదారులు

|
Google Oneindia TeluguNews

ముంబై : అసలే ఎండకాలం .. ఆపై ఫ్లై ఓవర్ ... అటు వైపు పెట్రోల్ ట్యాంకర్ వెళ్తుంది. ఇప్పటివరకు బానే ఉంది. కానీ ఆ ట్యాంకర్‌లో మంటలు చెలరేగాయి. ఇంకేముంది పట్టపగలు, నడిరోడ్డు మీద మంటలు ఎగసిపడటంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే ఘటన స్థలానికి చేరుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పేందకు కష్టపడ్డారు. ముంబై నడిబొడ్డున గల గొరెగావ్‌లో ఈ ఘటన జరిగింది.

ట్యాంకర్‌లో మంటలు ..
గోరెగావ్‌లో ఆరే ఫ్లై ఓవర్ మధ్యలో పెట్రోల్ ట్యాంకర్ నుంచి మంటలు ఎగసిపడటంతో వాహనదారులు భయాందోళనకు గురయ్యారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు ఆ ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. వాహనదారులను అక్కడినుంచి పంపించివేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకున్నారు. పెట్రోల్ ట్యాంకర్ వాహనంలో డ్రైవర్ ఒక్కరే ఉన్నారని .. ట్యాంకులో 20 వేల లీటర్ల డీజిల్ ఉందని పేర్కొన్నారు.

Petrol tanker catches fire on Goregaon flyover, traffic affected

స్తంభించిన ట్రాఫిక్
దీంతో ఆందేరి నుంచి గోరెగావ్ మధ్య ట్రాఫిక్ స్తంభించిపోయింది. దీనికి సంబంధించి ఓ వీడియో కూడా నెటిజన్లు పోస్ట్ చేశారు. పెట్రోల్ ట్యాంకు అగ్ని ప్రమాదానికి గురైన సంగతి తెలిసింది 'ముంబై పోలీసు ఇమ్మిడియేట్ హెల్ప్' పేరుతో నెటిజన్లు సోషల్ మీడియా ట్విట్టర్ లో కోరారు. దీనితో స్పందించిన ముంబై పోలీసులు ట్రాఫిక్ పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది అక్కడికి చేరుకున్నారు. 'మా సిబ్బంది ఘటనాస్థలానికి చేరుకుంటున్నారు, కాసేపట్లో ట్రాఫిక్ క్లియర్ చేసి సాధారణ పరిస్థితులు తీసుకొస్తాం' అని రీ ట్వీట్ చేశారు. ఇప్పటికే మంటలను ఆర్పివేశామని .. కానీ ఆ ప్రాంతంలో అగ్నిమాపక సిబ్బంది ఉండి పరిస్థితిని సమీక్షిస్తున్నారని మరో ట్వీట్‌లో పేర్కొన్నారు.

English summary
traffic on Mumbai's Western Express Highway (WEH) came to a standstill after a petrol tanker caught fire on the middle of the Aarey flyover in Goregaon. The firefighting operations are underway.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X