• search
 • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

వావ్.. గుడ్ న్యూస్, 5-11 ఏళ్ల వారికి ఫైజర్ టీకా సేఫ్: నిపుణులు

|

కరోనాను జయించాలంటే టీకా తీసుకోవాల్సిందే. తొలుత వృద్దులకు.. ఆపై 45 ఏళ్ల లోపు వారికి.. ఇప్పుడు 18 ఏళ్ల పై వారికి టీకా ఇస్తున్నారు. అయితే చిన్న పిల్లల గురించి పరిశోధనలు చేస్తున్నారు. వారి కోసం ప్రత్యేక వ్యాక్సిన్ రూపొందించడంలో నిపుణులు బిజీగా ఉన్నారు. దీనికి సంబంధించి ఒక అప్ డేట్ తెలిసి వచ్చింది. ఐదేళ్ల నుంచి 11 ఏళ్ల చిన్నారులకు యాంటి బాడీలు ఉత్పత్తి అవుతున్నాయని ఫైజర్, బయోటెక్ కంపెనీ తెలిపింది.

 పరిశీలన

పరిశీలన

దీనికి సంబంధించి త్వరలో ఆమోదం వస్తోందని చెబుతోంది. పిల్లలకు 10 మెక్రో గ్రామ్స్ గల రెండు డోసుల టీకా ఇచ్చామని పేర్కొన్నారు. 21 రోజులు పరిశీలించామని వివరించింది. 12 ఆ పై వయస్సు గల వారికి 30 గ్రాముల డోసు ఇచ్చామని పేర్కొంది. పిల్లలకు ఇచ్చిన టీకా సురక్షితమైనదని.. యాంటీబాడీలు ఉత్పన్నం అవుతున్నాయని వివరించింది. ఈ సమాచారాన్ని అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ యూరొపియన్ మెడిసన్స్ ఏజెన్సీకి అందజేస్తామని తెలిపింది.

 240 శాతం

240 శాతం

జూలై నుంచి చిన్నపిల్లల కరోనా కేసులు అమెరికాలో ఎక్కువగా ఉంది. 240 శాతం ఎక్కువగా ఉండగా.. ఈ పరిశోధన తీపికబురు కానుంది. దీంతో ఎఫ్‌డీఏ, ఇతర సంస్థలకు సమాచారం అందజేస్తామని ఫైజర్ చైర్మన్ అల్బర్ట్ బౌర్లా తెలియజేశారు. భద్రత చర్యలు తీసుకొని అత్యవసరం అందజేసే అంశం గురించి ఎఫ్‌డీఏ ఆమోదం తెలిపిందని సమాచారం. ఈఎంఏ, ఈయూకు కూడా రిక్వెస్ట్ పెడతామని సంకేతాలు ఇచ్చారు. ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత 2 ఏళ్ల నుంచి 5 ఏళ్లు.. 6 నెలల నుంచి 2 ఏళ్ల వరకు టీకాకు సంబంధించి నాలుగో త్రైమాసికంలో అధ్యయనం చేస్తామని తెలిపింది. ఫేజ్1,2,3లలో 4500 మంది చిన్నారులు.. 6 నెలల నుంచి 11 ఏళ్ల లోపు వారికి క్లినికల్ ట్రయల్స్ చేశారు. వీరిలో అమెరికా, ఫిన్లాండ్, పొలాండ్, స్పెయిన్ దేశాలకు చెందిన వారు ఉన్నారు.

 కరోనా ప్రభావం..

కరోనా ప్రభావం..

ఇటు వేసవిలోనే కరోనా వైరస్ ప్రభావం ఎక్కువగా ఉంటోంది. గతేడాది సమ్మర్‌లో కరోనా ఇంపాక్ట్ ఎక్కువగానే ఉంది. ఈ సారి సెకండ్ వేవ్ వల్ల యువత పిట్టల్లా రాలిపోయారు. థర్డ్‌వేవ్ పిల్లలకు అని ప్రచారం జరుగుతోంది. వచ్చే నెలలో అని నిపుణులు చెబుతున్నారు. దీంతో ఆందోళన నెలకొంది. మరోవైపు వచ్చే ఏడాది సమ్మర్‌లో ఫోర్త్ వేవ్ అని కూడా అంటున్నారు. దీంతో కరోనా 5,6 ఏళ్లు ఉంటుందని అర్థం చేసుకోవచ్చు.

  షాకింగ్..'Mu' Variant వ్యాక్సిన్లకు లొంగదు - WHO || Oneindia Telugu
   బూస్టర్ డోస్

  బూస్టర్ డోస్

  వానకాలం రావడంతో ఫంగస్ ఇంపాక్ట్ తగ్గుతుందని వైద్యులు సూచిస్తున్నారు. ఇప్పటివరకు బ్లాక్ ఫంగస్ ఇంపాక్ట్ కనిపించింది. మొత్తానికి కరోనాతో కలిసి బతకాల్సిందే.. అందుకోసం విధిగా మాస్క్ ధరించి.. శానిటైజర్ రాసుకుంటూ కాలం వెళ్లదీయాల్సిందే. రెండు డోసులతోపాటు బూస్టర్ డోస్ టీకా కూడా తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ప్రస్తుతం అయితే అందరికీ సెకండ్ డోసు ఇస్తున్నారు. ఇది పూర్తయితే దేశంలో చాలా మంది రెండు డోసులు తీసుకున్నట్టు అవుతుంది. దీంతోపాటు బూస్టర్ డోసు వేసుకోవాలని నిపుణులు సూచన చేస్తున్నారు. ఇటు డేల్టా వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. డేల్టా ప్లస్ వేరియంట్ మరింత ప్రమాదకరం అని ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపింది. దీంతో కరోనా కోసం మరింత పకడ్బందీగా ఉండాల్సిందే. తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు థర్డ్ వేవ్ అని నిపుణులు చెప్పడంతో భయాందోళన నెలకొంది.

  English summary
  Pfizer and BioNTech SE on Monday said trial results of COVID-19 vaccine showed that it is safe and produced robust neutralizing antibody response in children aged five to 11 years.
  న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
  Enable
  x
  Notification Settings X
  Time Settings
  Done
  Clear Notification X
  Do you want to clear all the notifications from your inbox?
  Settings X