వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అయ్యో పాపం.. చెల్లి పెళ్లికి సెలవు ఇవ్వలేదని..

|
Google Oneindia TeluguNews

రోహ్‌తక్ : తెల్లారితే చెల్లెలి పెళ్లి. కర్నాటకలో కుటుంబసభ్యులందరూ పెళ్లి పనుల్లో బిజీగా ఉన్నారు. హర్యానాలో పీజీ చేస్తున్న ఆ డాక్టర్‌కు హెచ్ఓడీ లీవ్ ఇవ్వలేదు. దీంతో పెళ్లికి వెళ్లలేక మథనపడ్డాడు. తోబుట్టువు వివాహ వేడుకలో సందడి చేద్దామనుకున్న యువకుడు కఠిన నిర్ణయం తీసుకున్నాడు. సోదరి కోసం తెచ్చిన చున్నీనే ఉరితాడుగా మార్చుకున్నాడు. క్షణికావేశంలో ప్రాణాలు తీసుకున్నాడు.

కాళ్లు చేతులు కట్టేసి.. మత్తు ఇంజెక్షన్ ఇచ్చి.. సినీ ఫ‌క్కీలో మ‌ర్డ‌ర్ ప్లాన్ చేసిన హీరో..

చెల్లెలి పెళ్లికి దొరకని సెలవు

చెల్లెలి పెళ్లికి దొరకని సెలవు

కర్నాటకకు చెందిన ఓంకార్ హర్యానాలోని రోహ్‌తక్ పీజీఐలో పీడియాట్రిక్స్‌లో పీజీ చేస్తున్నాడు. రెసిడెంట్ డాక్టర్ అయిన ఆయన శుక్రవారం చెల్లెలి పెళ్లి ఉండటంతో వెళ్లేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకున్నాడు. వారం క్రితమే హెచ్ఓడీని పర్మిషన్ అడిగాడు. అయితే ఆమె నిరాకరించడంతో గురువారం నాటికైనా మనసు మార్చుకోకపోతుందా అని వేచి చూశాడు. చెల్లెలి కోసం షాపింగ్ చేసి బట్టలు కొన్నాడు. గురువారం సాయంత్రం మరోసారి హెచ్ఓడీ గీతా గటావల్ వద్దకు వెళ్లి లీవ్ అడిగాడు. ఆమె ససేమిరా అనడంతో మనస్తాపానికి గురయ్యాడు. హాస్టల్‌కు తిరిగొచ్చిన ఓంకార్ ఎవరితో మాట్లాడకుండా రూంలో ఒక్కడే ఉండిపోయాడు.

చున్నీతో ఉరేసుకుని

చున్నీతో ఉరేసుకుని

రాత్రి 10గంటల సమయంలో ఓంకార్ రూమ్మేట్ వచ్చి డోర్ కొట్టగా ఎలాంటి స్పందన రాలేదు. దీంతో కిటికీలోంచి తొంగిచూడగా.. ఓంకార్ ఫ్యాన్‌కు వేలాడుతూ కనిపించాడు. దీంతో తలుపులు పగలగొట్టి లోపలికెళ్లిన స్నేహితుడు కిందకు దించాడు. కానీ అప్పటికే ఓంకార్ ఊపిరి ఆగిపోయింది. చెల్లెలి కోసం తెచ్చిన చున్నీతో ఉరివేసుకోవడంతో చనిపోయాడు. విషయం హాస్టల్‌లోని మిగతా వారికి తెలియడంతో రెసిడెంట్ డాక్టర్లంతా అతని గది వద్దకు చేరుకున్నారు.

హెచ్ఓడీ ఇంటి ఘెరావ్

హెచ్ఓడీ ఇంటి ఘెరావ్

సెలవు ఇవ్వని కారణంగానే ఓంకార్ ఆత్మహత్య చేసుకున్నాడని ఆరోపించిన రెసిడెంట్ డాక్టర్లు హెచ్ఓడీ గీత ఇంటిని ముట్టడించారు. ఓంకార్ ప్రాణాలు తీసిందంటూ నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు. దీంతోభయంతో వణికిపోయిన ఆమె పోలీసులకు సమాచారం ఇచ్చింది. గీత నివాసానికి చేరుకున్న పోలీసులు ఆందోళనకారులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. ఆలోగా అక్కడికి చేరుకున్న యూనివర్సిటీ వీసీ రెసిడెంట్ డాక్టర్లతో మాట్లాడారు. అయితే నిందితురాలిపై కేసు నమోదుచేసిన తర్వాతే వెనుదిరుగమని వారు బీష్మించారు. పోలీసులు, వీసీ తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో వారు వెనుదిరిగారు.

English summary
PG doctor committed suicide in rohtaks hostel. Final year student allegedly hanged himself because HOD refused to give leave to attend his sisters marriage. Resident doctors protested in front of hod house and demand to take stringent action against her.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X