• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఫాల్గుని గానం .. అంబానీల స్టెప్పులు ... ఆకాశ్- శ్లోకా పెళ్లి వేడుకలో జోష్

|

ముంబై : ప్రముఖ పారిశ్రామిక వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేశ్ అంబానీ నివాసం ఆంటీలియాలో పెళ్లి సందడి మొదలైంది. తన పెద్ద కుమారుడు ఆకాశ్ అంబానీ, వజ్రాల వ్యాపారి రస్సెల్ మెహతా కూతురు శ్లోకాతో వచ్చేనెల 9న అంగరంగ వైభవంగా పెళ్లి జరుగనుంది. ఈ క్రమంలో సోమవారం రాత్రి తన నివాసం ఆంటిలీయాలో మ్యూజికల్ నైట్ ఏర్పాటు చేశారు. ప్రముఖ సింగర్ ఫాల్గుడి పాథక్ పాటలు పాడగా .. ఇరు కుటుంబాలు డ్యాన్స్ లతో హోరెత్తించాయి. దాదాపు రాత్రంతా స్టెప్పులేసి ఉత్సాహంగా గడిపారు. ఈ మ్యూజికల్ నైట్ కు ఆకాశ్ నానమ్మ కోకిలాబెన్, అనిల్ అంబానీ సతీమణి టీనా అంబానీ హాజరయ్యారు.

జియో వరల్డ్ సెంటర్ లో పెళ్లి

ముంబైలో ఆకాశ్ పెళ్లిని జరిపేందుకు ముఖేశ్ నిర్ణయించినట్టు తెలుస్తోంది. బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లోని జియొ వరల్డ్ సెంటర్ లో ఆకాశ్- శ్లోకా ఒక్కటికానున్నారు. మూడురోజులు జరిగే వేడుక కోసం ఇప్పటికే ఏర్పాట్లు పూర్తయ్యాయి. సంగీత్ మొదలై .. రిసెప్షన్ .. పెళ్లితో ఈ వివాహ క్రతువు ముగియనుంది. వీరి నిశ్చితార్థం గతేడాది జూన్ లో కన్నులపండుగగా జరిగిన సంగతి తెలసిందే.

సిద్ధి సేవలో ముకేశ్ దంపతులు

సిద్ధి సేవలో ముకేశ్ దంపతులు

ముంబై అంటేనే ముందుగా గుర్తొచ్చేది సిద్ధి వినాయక ఆలయం. ఈ టెంపుల్ అంటే ముఖేశ్ అంబానీకి సెంటిమెంట్. సోమవారం సాయంత్రం ఆలయంలో ఆకాశ్- శ్లోకాల మొదటి వివాహ ఆహ్వాన పత్రికను వినాయకుడి పాదాల వద్ద ఉంచి ప్రత్యేక పూజలు చేశారు. గతేడాది డిసెంబర్ లో కూతురు ఇషా అంబానీ పెళ్లి పత్రికకు కూడా ఇదేవిధంగా పూజలు నిర్వహించారు. ఇషా అంబానీ వివాహం ఆనంద్ పిరమాల్ తో జరిగిన సంగతి విదితమే.

స్టాలిన్ కు ఫస్ట్ కార్డ్

స్టాలిన్ కు ఫస్ట్ కార్డ్

ఆ తర్వాత డీఎంకే అధినేత స్టాలిన్ ను కలిసేందుకు చెన్నై వెళ్లారు ముఖేశ్ దంపతులు. ఆకాశ్ .. పెళ్లి కార్డును అందజేసి .. వివాహానికి రావాల్సిందిగా కోరారు. ఆ తర్వాత స్టాలిన్ కాసేపు ముచ్చటించి .. తిరిగి ముంబై వెళ్లిపోయారు.

స్విట్జర్లాండ్ లో బ్యాచిలర్ పార్టీ

స్విట్జర్లాండ్ లో బ్యాచిలర్ పార్టీ

పెళ్లికొడుకు ఆకాశ్ అంబానీ తన బ్యాచిలర్ పార్టీకి భారీ ఏర్పాట్లు చేసుకున్నారు. తన స్నేహితులకు గ్రాండ్ గా పార్టీ ఇచ్చేందుకు డెస్టినేషన్ లోకేషన్ ఎంచుకున్నారు. ఫిబ్రవరి 23 నుంచి 25 వరకు స్విట్జర్లాండ్ లో బ్యాచిలర్ పార్టీ ఇస్తానని ప్రకటించాడు. స్నేహితులతో కలిసి ... స్విట్జర్లాండ్ లో నిర్వహించే బ్యాచిలర్ పార్టీకి సంబంధించిన ఏర్పాట్ల ప్రక్రియ పూర్తిచేసినట్టు తెలుస్తోంది.

English summary
Reliance Industries chief Mukesh Ambani's residence was inaugurated in Andalia. His eldest son Akash Ambani, daughter of diamond merchant, Russell Mehta, will marry Shloka on the 9th of the march, The musical night was set up in Antilia, his residence on Monday night. The famous Singer Falgudi Pathak sang the songs and the two families dancing. The musical night was attended by Akash grandmother Kokilaben and Anil Ambani's wife Tina Ambani.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X