వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

ఉప ముఖ్యమంత్రి ఫోన్ నుంచి పోర్న్ వీడియోలు, ఫొటోలు: సోషల్ వర్కర్లకు: గాఢనిద్రలో డిప్యూటీ

|
Google Oneindia TeluguNews

పనాజీ: గోవా ఉప ముఖ్యమంత్రి చంద్రకాంత్ బాబు కవ్లేకర్ వివాదాల్లో చిక్కుకున్నారు. ఆయన వినియోగించే స్మార్ట్‌ఫోన్ నుంచి కొంతమంది సోషల్ వర్కర్లకు సంబంధించిన వాట్సప్‌కు పోర్న్ వీడియోలు, ఫొటోలు పోస్ట్ అయ్యాయి. ఓ ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ఫోన్ నుంచి తమకు అందిన ఆ పోర్న్ వీడియోలను చూడగానే సోషల్ వర్కర్లు బిత్తరపోయారు. పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. దీనిపై సమగ్ర విచారణ జరపించాలని విజ్ఙప్తి చేశారు.

ఈ ఘటన గోవాలో ప్రకంపలను పుట్టిస్తోంది. వివాదాలను రేకెత్తిస్తోంది. దీనిపై చంద్రకాంత్ కవ్లేకర్ వివరణ ఇచ్చారు. అక్కడితో ఆగలేదాయన. సైబర్ సెల్ విభాగంలో ఎదురు ఫిర్యాదు చేశారు. అశ్లీల చిత్రాలు, పోర్న్ వీడియోలను తాను పంపలేదని వివరణ ఇచ్చారు. తన ఫోన్ హ్యాక్‌కు గురైందని చెప్పారు. గాఢనిద్రలో ఉన్న సమయంలో దాన్ని హ్యాకర్లు.. సోషల్ వర్కర్ల వాట్సప్ గ్రూప్‌నకు అశ్లీల, అభ్యంతరకర వీడియోలను పోస్ట్ చేసి ఉంటారని చెప్పారు. దీనిపై విచారణ జరిపించాలని, నిందితులను శిక్షించాలని ఆయన పోలీసులకు ఆదేశించారు.

 Phone Hacked, Asleep When Obscene Clip Sent says Goa Deputy CM Chandrakant

ఆదివారం అర్ధరాత్రి సమయంలో చంద్రకాంత్ బాబు కవ్లేకర్ స్మార్‌ఫోన్ నుంచి ఈ వీడియోలు సామాజిక కార్యకర్తల వాట్సప్ గ్రూప్‌లో పోస్ట్ అయ్యాయి. గోవాకు చెందిన సోషల్ వర్కర్లు ఈ గ్రూప్‌ను ఏర్పాటు చేసుకున్నారు. సామాజిక కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొనే ఈ వాట్సప్ గ్రూప్‌లో కొందరు మహిళలు కూడా ఉన్నారు. అలాంటి వాట్సప్ గ్రూప్‌లోకి అశ్లీల వీడియోలు ఉప ముఖ్యమంత్రి వినియోగించే స్మార్ట్‌ఫోన్ నుంచి పోస్ట్ కావడం పట్ల దుమారం చెలరేగుతోంది. ఆ వీడియోలన్నీ పోర్న్ కంటెంట్ ఉన్నవే. అశ్లీల భరిత వీడియోలను చూసిన తరువాత సోషల్ వర్కర్లు షాక్‌కు గురయ్యారు.

దీనిపై కాంగ్రెస్ పార్టీ అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఉప ముఖ్యమంత్రి స్థాయి నాయకుడి ప్రవర్తన అసభ్యకరంగా ఉందని మండిపడుతోంది. ఆయనపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు ఆ పార్టీ నాయకులు. సామాజిక కార్యకర్తలను అవమానపర్చడానికి, వారిని కించపర్చడానికే చంద్రకాంత్ కవ్లేకర్ ఉద్దేశపూరకంగా పోర్న్ వీడియోలను పంపించి ఉంటారని మండిపడుతున్నారు. దీనిపై చంద్రకాంత్ వివరణ ఇచ్చారు. ఫోన్ హ్యాక్‌కు గురైందని సైబర్ సెల్ విభాగానికి ఫిర్యాదు చేశారు.

English summary
Chandrakant Kavlekar has said in his complaint to the cyber police that the clip was sent to the WhatsApp group from his phone when he was "nowhere near the phone and fast asleep".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X