బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోన్ ట్యాపింగ్ కేసు సీబీఐతో కాదు ట్రంప్ సలహాలు తీసుకోండి, నో ప్రాబ్లమ్, మాజీ సీఎం !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సీబీఐతో దర్యాప్తు చేయించండి, అవసరం అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాలు తీసుకుని అంతర్జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మెడ మీద కత్తి వేలాడుతోంది.

బెంగళూరు: ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ సీబీఐతో దర్యాప్తు చేయించండి, అవసరం అయితే అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ సలహాలు తీసుకుని అంతర్జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జేడీఎస్ నేత హెచ్.డి. కుమారస్వామి అన్నారు. ఫోన్ ట్యాపింగ్ కేసు కర్ణాటకలో మాజీ ముఖ్యమంత్రి హెచ్.డి. కుమారస్వామి మెడ మీద కత్తి వేలాడుతోంది.

బీజేపీ చేతికి బ్రహ్మాస్రం

బీజేపీ చేతికి బ్రహ్మాస్రం

హెచ్.డి. కుమారస్వామి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పలువురు బీజేపీ నాయకులు, అనర్హత ఎమ్మెల్యేలు, పాత్రికేయులు, సినీ తారలు, కాంగ్రెస్ సీనియర్ నాయకుల ఫోన్లు ట్యాపింగ్ అయ్యిందని యడియూరప్ప ప్రభుత్వానికి, డీజీపీకి బెంగళూరు సీసీబీ జాయింట్ పోలీసు కమిషనర్ సందీప్ పాటిల్ నివేదిక అందించారు.

సీఎం ఆఫీస్ లోనే ట్యాపింగ్ ?

సీఎం ఆఫీస్ లోనే ట్యాపింగ్ ?

తమ ఫోన్లు ట్యాపింగ్ చేసి అధికార దుర్వినియోగం చేశారని, అప్పటి సీఎం కుమారస్వామి కార్యాలయంలోని కొందరు అధికారుల ఒత్తిడితో అక్కడి నుంచి ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని మాజీ మంత్రి, జేడీఎస్ పార్టీ నుంచి బహిష్కరణకు గురైన అనర్హత ఎమ్మెల్యే హెచ్. విశ్వనాథ్ ఆరోపణలు చేశారు. మాజీ మంత్రి విశ్వనాథ్ చేసిన ఆరోపణలు చిలికి చిలికి గాలివానగా మారింది.

మీడియా ఒత్తిడికి లొంగను

మీడియా ఒత్తిడికి లొంగను

ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారంపై మీడియాతో మాట్లాడిన మాజీ సీఎం హెచ్.డి. కుమారస్వామి తన మీద ఇలాంటి ఆరోపణలు రావడం భాదాకరంగా ఉందని విచారం వ్యక్తం చేశారు. ఎలాంటి పరిస్థితుల్లో తాను ఎలక్ట్రానిక్ మీడియా ఒత్తిడికి లొంగనని, మీడియా ఏం కావాలన్నా చేసుకోవచ్చని, ఫోన్లు ట్యాపింగ్ అయ్యాయని కట్టుకథలతో స్టోరీలు ప్రసారం చేశాయని మాజీ సీఎం కుమారస్వామి మండిపడ్డారు.

విచారణకు సిద్దం

విచారణకు సిద్దం

ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారం సీబీఐతో కాదు, అంతర్జాతీయ దర్యాప్తు సంస్థతో విచారణ చేయించినా తనకు ఎలాంటి అభ్యంతరం లేదని, విచారణకు తనతో పాటు జేడీఎస్ పార్టీ పూర్తిగా సహకరిస్తుందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు. ఎలక్ట్రానిక్ మీడియా కట్టుకథలు విచారణలో వెలుగు చూస్తాయని, కొందరి కుట్ర వలనే తన మీద ఆరోపణలు వచ్చాయని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

ప్రభుత్వం ఉంటుందా ? ఊడుతుందా ?

ప్రభుత్వం ఉంటుందా ? ఊడుతుందా ?

తన మీద వచ్చిన ఆరోపణల విషయంలో ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడానికే బీజేపీ ప్రభుత్వం ప్రయత్నిస్తున్నదని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. భారీ వర్షాలు, వరదలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారి సమస్యలు పరిష్కరించకుండా బీజేపీ ప్రభుత్వం కుళ్లు రాజకీయాలు చేస్తుందోని మాజీ సీఎం కుమారస్వామి ఆరోపించారు. ఈ ప్రభుత్వం (బీజేపీ) ఉంటుందో ? ఊడుతుందో ? తనకు తెలీదని, ప్రజల సమస్యలు వెంటనే పరిష్కరించాలని జేడీఎస్ డిమాండ్ చేస్తోందని మాజీ సీఎం కుమారస్వామి అన్నారు.

English summary
Not only CBI, but also probe hand over to international agency, former chief minister H.D. Kumaraswamy reacted to media in Kukke Subrahmanya in Karnataka.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X