బెంగళూరు వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఫోన్ ట్యాపింగ్ ఎఫెక్ట్: ఐపీఎస్ అధికారి బదిలి, పోస్టింగ్ మాత్రం లేదు, సంకీర్ణం దెబ్బ !

|
Google Oneindia TeluguNews

బెంగళూరు: ప్రముఖ వ్యక్తుల ఫోన్లు ట్యాపింగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కర్ణాటక సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ మీద బదిలి వేటు పడింది. కేఎస్ఆర్ పీ ఏడీజీపీగా పని చేస్తున్న అలోక్ కుమార్ ను ఆ పదవి నుంచి తప్పించారు. అయితే అలోక్ కుమార్ కు ఏ భాద్యత అప్పగించకపోవడం చర్చకు దారితీసింది. సీనియర్ ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ ను అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతున్న సమయంలో ఆయన మీద బదిలీ వేటు పడింది.

సీబీఐ ముందు బాంబు పేల్చిన ఐపీఎస్, 600 మంది ఫోన్లు ట్యాపింగ్ ?: కింగ్ పిన్ !సీబీఐ ముందు బాంబు పేల్చిన ఐపీఎస్, 600 మంది ఫోన్లు ట్యాపింగ్ ?: కింగ్ పిన్ !

సంకీర్ణ ప్రభుత్వం దెబ్బ !

సంకీర్ణ ప్రభుత్వం దెబ్బ !

కాంగ్రెస్-జేడీఎస్ పార్టీల సంకీర్ణ ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలో అలోక్ కుమార్ బెంగళూరు నగర పోలీసు కమిషనర్ గా పని చేశారు. ఆ సమయంలో వివిద రాజకీయ పార్టీల సీనియర్ నాయకులు, సినీ తారలు, మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు వివిద శాఖల సీనియర్ అధికారుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఉన్నాయి.

 ఆయనకు అన్నీ తెలుసు ?

ఆయనకు అన్నీ తెలుసు ?

ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ చేస్తున్న సీబీఐ అధికారులు ఇప్పటికే ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ ను విచారణ చేసి వివరాలు సేకరించారు. అలోక్ కుమార్ కు అన్నీ తెలిసే ఫోన్లు ట్యాపింగ్ వ్యవహారం జరిగిందని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

 అరెస్టు భయం

అరెస్టు భయం

అలోక్ కుమార్ ను సీబీఐ అధికారులు అరెస్టు చేసే అవకాశం ఉందని ప్రచారం జరుగుతోంది. ఫోన్ ట్యాపింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ కుమార్ ను కేపీఎస్ఆర్ పీ భాద్యతల నుంచి తప్పించారు. సీటీఆర్ ఎస్ ఏడీజీపీగా పని చేస్తున్న పీఎస్. సింధుకు కేఎస్ఆర్ పీ భాద్యతలు అప్పగించారు.

వెయిటింగ్

వెయిటింగ్

ఐపీఎస్ అధికారి అలోక్ కుమార్ కు మాత్రం ఎక్కడా భాద్యతలు అప్పగించలేదు. సంకీర్ణ ప్రభుత్వంలో సుమారు 600 మంది ప్రముఖుల ఫోన్లు ట్యాపింగ్ చేశారని ఆరోపణలు ఎదుర్కొంటున్న అలోక్ కుమార్ ను సస్పెండ్ చేసే అవకాశం ఉందని తెలిసింది.

అన్ని పార్టీల డిమాండ్

అన్ని పార్టీల డిమాండ్

అలోక్ కుమార్ ఇంటిలోనే ప్రత్యేక సదుపాయాలు ఏర్పాటు చేసి ఫోన్లు ట్యాపింగ్ చేశారని కొందరు ప్రముఖులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అన్ని పార్టీల నాయకులు డిమాండ్ చేయడంతో కర్ణాటక సీఎం బీఎస్. యడియూరప్ప ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సీబీఐకి అప్పగించారు.

English summary
Karnataka state government has transfered KSRP ADGP Alok Kumar who is facing phone tapping allegation during coalication government.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X