వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కేరళ నన్ రేప్ కేసు: ఫిర్యాదు చేసిన ఫాధర్ కురియాకోస్ కట్టుతారా అనుమానాస్పద మృతి

|
Google Oneindia TeluguNews

కేరళ నన్ అత్యాచారం కేసులో మరో ట్విస్టు చోటుచేసుకుంది. జలంధర్ మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్ పై అత్యాచారం ఆరోపణలు చేస్తూ ఫిర్యాదు చేసిన తొలివ్యక్తి జలంధర్ డయాస్‌కు చెందిన ఫాదర్ కురియాకోస్ కట్టుతారా అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. సోమవారం అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడని తమకు ఫోన్ వచ్చినట్లు కేరళలోని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.

సోమవారం ఉదయం తనకు మైఖేల్ అన్నికుజికటిల్ అనే మరో ఫాదర్ నుంచి ఫోన్ వచ్చినట్లు తెలిపారు కట్టుతారా సోదరుడు జోస్ కట్టుతార. తన సోదరుడు మృతి చెందినట్లుగా ఫాదర్ తెలిపారని దీంతో షాక్‌కు గురయ్యానని కేరళలో ఉంటున్న జోస్ కట్టుతార తెలిపారు. అయితే తన మృతి పై చాలా అనుమానాలున్నాయని చెప్పిన ఆయన తన సోదరుడిని హత్యచేసి ఉంటారని చెప్పారు. సోమవారం ఉదయం 11 గంటలకు ఫోన్ వచ్చిందని ఫాదర్ కురియాకోస్ కట్టుతారా శుక్రవారం రాత్రే మృతి చెందినట్లు వారు చెప్పారని వెల్లడించారు. మృతిపై ఇంత ఆలస్యంగా తమకు సమాచారం ఇవ్వడంతో తమకు అనుమానం వచ్చినట్లు మృతుడి కుటుంబ సభ్యులు తెలిపారు.

<strong>మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు బెయిల్ మంజూరు</strong>మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌కు బెయిల్ మంజూరు

photo father kuriakose died in kerala nun rape case

"సోమవారం ఉదయం 10 గంటల సమయం అయినా ఫాదర్ కట్టుతారా నిద్రనుంచి లేవలేదు. ఈ క్రమంలోనే సిస్టర్లు వెళ్లి ఆయన్ను నిద్రలేపేందుకు ఆయన గదికి వెళ్లారు. తలుపులు ఎంత కొట్టినప్పటికీ ఫాదర్ తలుపు తీయకపోవడంతో అనుమానం వచ్చి పై అధికారులకు వారు సమాచారం ఇచ్చారు. గది తలుపులు పగలగొట్టి లోపలికి వెళ్లి చూడగా ఫాదర్ కురియాకోస్ కట్టుతారా అచేతన స్థితిలో పడి ఉన్నారు. పక్కనే తాను వామిటింగ్ చేసిన ఆనవాలు ఉన్నాయి. హాస్పిటల్‌కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు." అని జలంధర్ డయాస్‌కు చెందిన మరో ఫాదర్ పీటర్ వెల్లడించారు.

ప్రముఖ మళయాలీ పత్రికకు ఇంటర్వ్యూ ఇచ్చిన ఫాదర్ కురియాకోస్ కట్టుతారా తన ప్రాణానికి ముప్పు ఉందని తెలిపారు. మాజీ బిషప్ ఫ్రాంకో ములక్కల్‌ నన్ పై అత్యాచారానికి పాల్పడ్డారంటూ మిషనరీస్ ఆఫ్ జీసస్‌కు చెందిన నన్‌లు ధర్నా చేస్తుండగా వారికి ఫాదర్ కట్టుతారా మద్దతుగా నిలిచారు. ఇదిలా ఉంటే మాజీ బిషప్ ములక్కల్‌కు గతవారమే కేరళ హైకోర్టు మంజూరు చేసింది. కేరళ నన్‌పై వరుసగా అత్యాచారం చేయడంతో సెప్టెంబర్ 21న ములక్కల్‌ను అరెస్టు చేశారు. ఇక బెయిల్‌పై విడుదల అయిన మాజీ బిషప్ ములక్కల్‌కు జలంధర్‌లో ఘనస్వాగతం పలికారు ఆయన మద్దతుదారులు.

English summary
Father Kuriakose Kattuthara, a priest of the Jalandhar diocese who had filed a complaint against rape-accused bishop Franko Mulakkal, was found dead on Monday morning. His family has raised suspicions and is set to file a police complaint in connection with the death.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X