వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కొట్టి.. కేసు పెట్టి.. ఫొటోగ్రాఫర్‌పై తేజ్ ప్రతాప్ బౌన్సర్ల ప్రతాపం..

|
Google Oneindia TeluguNews

Recommended Video

Lok Sabha Election 2019 : ఫొటోగ్రాఫర్‌నే కొట్టి... తిరిగి కేస్ పెట్టిన తేజ్ ప్రతాప్ యాదవ్...!!

పాట్నా : ఆర్జేడీ అధినేత లాలూప్రసాద్ యాదవ్ పెద్దకొడుకు తేజ్ ప్రతాప్ బాడీగార్డులు రెచ్చిపోయారు. పోలింగ్ బూత్ వద్ద వీరంగం సృష్టించారు. తేజ్ ప్రతాప్ డ్రైవర్ కారణంగా ఓ ఫొటోగ్రాఫర్‌ గాయపడగా.. అతన్ని సముదాయించాల్సింది పోయి కారు అద్దం ధ్వంసమైందని దాడికి దిగారు. ఇదంతా చూస్తూ కూర్చున్న తేజ్ ప్రతాప్ సదరు ఫొటోగ్రాఫర్‌పై కేసు పెట్టాడు. తనను చంపేందుకు కుట్రపన్నుతున్నారని ఆరోపించడం విశేషం.

సార్వత్రిక ఎన్నికల చివరి విడత పోలింగ్ సందర్భంగా తేజ్ ప్రతాప్ పాట్నాలో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మీడియాతో మాట్లాడిన అనంతరం ఆయన తన వాహనంలో కూర్చోవడంతో డ్రైవర్ కారును కొంచెం ముందుకుపోనిచ్చాడు. అయితే ఆ సమయంలో తేజ్ ప్రతాప్ ఫొటోలు తీస్తున్న ఒక ఫొటోగ్రాఫర్ కాలు ఆ వాహనం టైర్ కింద నలిగిపోయింది. సరిగ్గా కాలిపై టైరు ఉండటంతో కారును వెనక్కి తీయమని అన్నారు. ఆ గందరగోళంలో తేజ్ ప్రతాప్ కారు అద్దం ధ్వంసమైంది.

వాచౌట్: 2014లో ఏ సర్వే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి..?వాచౌట్: 2014లో ఏ సర్వే సంస్థ ఇచ్చిన ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యాయి..?

Photographer assaulted by Lalus elder son Tej Pratap Yadavs bodyguards

కారు అద్దం పగలడంతో తేజ్ ప్రతాప్ బౌన్సర్ ఒకరు కోపంతో రెచ్చిపోయాడు. ఫొటోగ్రాఫర్‌పై పిడిగుద్దులు కురిపించి, కెమెరాను ధ్వంసం చేశాడు. పోలీసులు మిగతా ఫొటోగ్రాఫర్లు అడ్డుకునే ప్రయత్నం చేసిన ఫలితం లేకుండా పోయింది. ఇంత జరిగినా తేజ్ ప్రతాప్ మాత్రం తనకేమీ పట్టనట్లు వ్యవహరించారు. అంతేకాదు.. తమ బౌన్సర్ల తప్పేమీలేదని వారి చర్యను సమర్థించుకున్నారు. తాను ఓటు వేసి వెళ్తుండగా సదరు ఫొటోగ్రాఫర్ కారు అద్దాలు ధ్వంసం చేశాడంటూ తేజ్ ప్రతాప్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ వ్యవహారం గమనిస్తే తనను చంపేందుకు కుట్ర జరుగుతోందన్న అనుమానం కలుగుతోందని తేజ్ ప్రతాప్ ఆరోపించడం కొసమెరుపు.

English summary
Private security guards of RJD chief Lalu Prasad's elder son Tej Pratap Yadav on Sunday roughed-up a cameraperson while he was covering Yadav at a polling booth. Yadav later alleged that the entire incident was a conspiracy to murder him.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X