వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చివరాఖరి టెస్టు: వాంఖడేలో సచిన్ ఇలా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

ముంబై: భారత మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ చివరి అంతర్జాతీయ టెస్టు మ్యాచు కావడంతో ముంబైలోని వాంఖడే స్టేడియంలో ఉద్వేగభరిత వాతావరణం నెలకొంది. మ్యాచు జయాపజయాలు, ఇతర క్రికెటర్ల ఆటతీరు అన్నీ పక్కకు వెళ్లి సచిన్ టెండూల్కర్ మాత్రమే కేంద్ర బిందువుగా మారాడు. గురువారం వెస్టిండీస్‌తో ప్రారంభమైన రెండో టెస్టు మ్యాచులో తన 200వ మ్యాచులో సచిన్ టెండూల్కర్ మొదటి రోజునే బ్యాటింగ్ చేశాడు.

నలబై ఏళ్ల సచిన్ టెండూల్కర్ మిన్నంటిన హర్షధ్వానాల మధ్య గురువారం మైదానంలోకి అడుగు పెట్టాడు. సచిన్ టెండూల్కర్‌కు తోటి ఆటగాళ్లు గార్డ్ ఆఫ్ హానర్ ఇచ్చారు. వెస్టిండీస్ బ్యాటింగ్ సందర్భంగా సచిన్ టెండూల్కర్‌కు బౌలింగు ఇవ్వాలని ప్రేక్షకులు పదే పదే పెద్ద పెట్టున అరిచారు. అయితే, కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీ వారి విజ్ఞప్తిని పట్టించుకోలేదు. స్పిన్నర్లు ప్రజ్ఞాన్ ఓజా, అశ్విన్‌లకు వికెట్లు పడుతుండడంతో ఆయన సచిన్‌కు బౌలింగ్ ఇచ్చి ఉండడు.

గురువారం తొలి రోజు ఆట ముగిసే సమయానికి భారత్ రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 157 పరుగులు చేసింది. టెండూల్కర్ 38 పరుగులతో క్రీజులో ఉన్నాడు. రేపు శుక్రవారం కూడా సచిన్ ప్రేక్షకులను అలరించనున్నాడు. కోల్‌కతా టెస్టు తొలి ఇన్నింగ్సులో అంపైర్ తప్పిదం వల్ల సచిన్ టెండూల్కర్ పెవిలియన్ చేరుకోవాల్సి వచ్చింది. వెస్టిండీస్ చెత్త ఆట వల్ల రెండో ఇన్నింగ్సు అవకాశం భారత్‌కు రాలేదు. దీంతో సచిన్ టెండూల్కర్ దాంతోనే సరిపెట్టుకోవాల్సి వచ్చింది.

బ్యాటింగ్‌కు రెడీ

బ్యాటింగ్‌కు రెడీ

బ్యాటింగ్ చేయడానికి సిద్దపడుతూ సచిన్ టెండూల్కర్ ఇలా... అతను మొదటి రోజు గురువారం ఆట ముగిసే సమయానికి 38 పరుగులు చేసి నాటవుట్‌గా మిగిలాడు.

హోం క్రౌడ్‌కు గుడ్ బై

హోం క్రౌడ్‌కు గుడ్ బై

తన చివరి, 200వ టెస్టు మ్యాచులో సచిన్ టెండూల్కర్ అభిమానుల వైపు చేయి ఊపుతూ అభివాదం చేశాడు.

సచిన్‌ను గౌరవించి విండీస్

సచిన్‌ను గౌరవించి విండీస్

గురువారం ఆట ప్రారంభానికి ముందు ఆటగాళ్లు చేసిన సంతకాలతో సచిన్ టెండూల్కర్‌కు వెస్టిండీస్ షర్టు ప్రదానం చేశారు.

మైదానంలో సచిన్ తల్లి

మైదానంలో సచిన్ తల్లి

సచిన్ టెండూల్కర్ తల్లి రజని తన కుమారుడి ఆటను చూసేందుకు వచ్చారు. తన కుమారుడి ఆటను ఆమె మొదటి సారి వీక్షించింది.

సచిన్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్

సచిన్ గౌరవార్థం పోస్టల్ స్టాంప్

సచిన్ టెండూల్కర్ గౌరవార్థం పోస్టల్ స్టాంపును విడుదల చేశారు. వాంఖడే స్టేడియం సచిన్ మయంగా మారింది.

ప్రేక్షకుల వైపు సచిన్ ఇలా..

ప్రేక్షకుల వైపు సచిన్ ఇలా..

గురువారం మ్యాచు ప్రారంభం రోజు సచిన్ టెండూల్కర్ ప్రేక్షకుల వైపు తిరిగి ఇలా తన అభిమానాన్ని చాటుకున్నాడు.

స్టేడియం వెలుపల ఫ్యాన్స్

స్టేడియం వెలుపల ఫ్యాన్స్

వాంఖడే స్టేడియం వెలుపల అభిమానులు సచిన్ టెండూల్కర్ పోస్టర్లతో ఇలా ప్రదర్శన ఇచ్చారు. మాస్టర్ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.

సచిన్ ఆటను చూసిన లెజెండ్స్

సచిన్ ఆటను చూసిన లెజెండ్స్

వెస్టిండీస్ మాజీ కెప్టెన్లు, క్రికెట్ దిగ్గజాలు క్లైవ్ లాయిడ్, బ్రియాన్ లారా భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఆటను చూస్తూ ఇలా..

అభిమానుల సందడి..

అభిమానుల సందడి..

సచిన్ టెండూల్కర్ చివరి టెస్టు మ్యాచ్ సందర్భంగా కర్ణాటకలోని మంగళూర్ అభిమానులు ఇలా సందడి చేశారు.

జట్టు సభ్యుల కరతాళ ధ్వనులు

జట్టు సభ్యుల కరతాళ ధ్వనులు

భారత క్రికెట్ జట్టు సభ్యులు సచిన్ టెండూల్కర్ గౌరవార్థం ఇలా కరతాళ ధ్వనులు చేశారు. సచిన్‌ పట్ల తమ అభిమానాన్ని చాటుకున్నారు.

సచిన్‌కు సెల్యూట్..

సచిన్‌కు సెల్యూట్..

మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్‌కు సెల్యూట్ చేయడానికి భారత క్రికెట్ జట్టు ఆటగాళ్లు ఇలా వరుస కట్టారు.

సచిన్‌తో కపిల్ సిబాల్

సచిన్‌తో కపిల్ సిబాల్

వాంఖడే స్టేడియంలో సచిన్ టెండూల్కర్‌పై ప్రత్యేక పోస్టల్ స్టాంప్ విడుదల సందర్భంగా కేంద్ర మంత్రి కపిల్ సిబాల్ ఇలా..

సచిన్ భార్య, కోచ్

సచిన్ భార్య, కోచ్

వాంఖడే స్డేడియంలో కోచ్ రమాకాంత్ అచ్రేకర్‌తో మాట్లాడుతూ సచిన్ టెండూల్కర్ సతీమణి అంజలి ఇలా కనిపించారు.

సచిన్ కుటుంబం అంతా..

సచిన్ కుటుంబం అంతా..

సచిన్ చివరి ఆటను చూడడానికి ఆయన కుటుంబ సభ్యులు వాంఖడే స్టేడియానికి వచ్చారు సచిన్ భార్య (ఎడమ పక్కన), ఆమె తల్లి (కుడివైపు రెండు)

షమీ త్వరగా వికెట్ తీశాడు..

షమీ త్వరగా వికెట్ తీశాడు..

భారత బౌలర్ మొహమ్మద్ షమీ వెస్టిండీస్‌ను ప్రారంభంలోనే దెబ్బ తీశాడు. క్రిస్ గేల్ వికెట్ తీసి భారత్‌కు మంచి ఆరంభాన్ని ఇచ్చాడు.

English summary
Vintage Sachin Tendulkar was on view in his 200th and final Test match here at the Wankhede Stadium on Thursday.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X