వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

చప్పట్లు: సభలో నటి రమ్య తొలి ప్రసంగంపై... (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: ప్రముఖ కన్నడ నటి రమ్య దివ్య స్పందన (27) లోకసభలో శుక్రవారం తొలిసారి ప్రసంగించిన విషయం తెలిసిందే. కర్ణాటకలోని మాండ్యా నియోజకవర్గం నుంచి ఎన్నికైన ఆమె తన వాగ్దాటితో సభికులను ఆకట్టుకున్నారు. లోకసభలో ఆమె ప్రసంగానికి ఇంటర్నెట్లోను అనూహ్య స్పందన లభించింది.

సమావేశాలకు చివరి రోజున ఆమె చెరుకు రైతుల సమస్యలను ప్రస్తావించారు. చెరుకు ద్వారా జీవ ఇంధనమైన ఇథనాల్‌ను ఉత్పత్తి చేసే విషయంలో రైతులను చైతన్యవంతులను చేయాల్సిన అవసరాన్ని రమ్య నొక్కి చెప్పారు.

బ్రెజిల్ ప్రజారవాణా వ్యవస్థలో 44 శాతం ఇథనాల్‌నే ఇంధనంగా వినియోగిస్తారని సభ దృష్టికి తెచ్చారు. అంతేగాకుండా, తాను సభకు కొత్త అయినా, ఎంతో సహృదయతతో ఆహ్వానించారని ఇతర సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. ఆమె ప్రసంగం ముగియగానే సభ్యులందరూ బల్లలు చరుస్తూ అభినందించారు.

రమ్య 1

రమ్య 1

కన్నడ నటి రమ్య దివ్య స్పందన (27) తొలిసారిగా లోక్‌సభలో శుక్రవారం ప్రసంగించారు. 2013లో కర్ణాటకలోని మాండ్య పార్లమెంటరీ నియోజక వర్గానికి జరిగిన ఉప ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తరపున బరిలోకి దిగిన ఆమె లోక్‌సభకు ఎన్నికయ్యారు.

రమ్య 2

రమ్య 2

15వ లోక్‌సభ సమావేశాల్లో చివరి రోజైన శుక్రవారం తొలిసారి ప్రసంగించిన రమ్య దివ్య స్పందన, హరిత ఇంధన ఉపయోగంపై ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. రమ్య ప్రసంగానికి అనూహ్య స్పందన వచ్చింది. ఇథనాల్ వంటి ఇంధనాన్ని చెరకు ఉప ఉత్పత్తుల నుంచి పొందవచ్చని ఆమె పేర్కొన్నారు.

రమ్య 3

రమ్య 3

గ్రీన్ ఇంధనమైన ఇథనాల్ ఉత్పత్తి కోసం చెరకు రైతులకు అవగాహన కల్పించాలని దివ్య కోరారు. వారికి అవగాహన కల్పించడం వల్ల గ్రీన్ ఇంధన ఉత్పత్తి మరింత సులభమవుతుందని చెప్పారు. బ్రెజిల్ దేశంలో 44శాతం మంది ప్రజలు ఇథనాల్ ఇంధనాన్ని ఉపయోగించి తమ రవాణాను కొనసాగిస్తున్నారని రమ్య దివ్య స్పందన తెలిపారు.

రమ్య 5

రమ్య 5

ఒకవేళ మనదేశం పెద్ద ఎత్తున ఇథనాల్ ఇంధనాన్ని ఉత్పత్తి చేసినట్లయితే, ఇతర దేశాల నుంచి ఇంధన దిగుమతిని క్రమంగా తగ్గించుకోవచ్చని ఆమె అన్నారు. తనకు స్వాగతం పలికిన ఇతర పార్లమెంటు సభ్యులకు రమ్య కృతజ్ఞతలు తెలిపారు. బల్లలు చరుస్తూ ఆమె ప్రసంగానికి సభ్యులు మద్దతు తెలిపారు.

English summary

 Kannada actress Ramya Divya Spandana, who was elected from Karnataka in a bye election from Mandya in 2013, today(Feb.21) made it sure that the Lok Sabha session does not end before she speaks in the House.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X