India
  • search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

రైల్వే బడ్జెట్‌పై నితీష్ ఫైర్: సదానంద ఇలా.. (పిక్చర్స్)

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: భారత జాతికి రైల్వే జీవనాడి అని, దేశ భద్రతలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం అన్నారు. రైల్వేబడ్జెట్-2014ను లోకసభలో కేంద్ర మంత్రి సదానంద ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొత్తరైళ్లు, లైన్ల కోసం ఎంపీల నుంచి ఎన్నో వినతులు వచ్చాయని చెప్పారు. భారత రైల్వేలు ఎన్నో సమస్యలు ఎదుర్కుంటున్నాయన్నారు.

భారత ఆర్థిక వ్యవస్థకు రైల్వే ఆత్మవంటిందని సదానంద అభివర్ణించారు. మౌలిక సదుపాయాల కోసం ఏడాదికి రూ.5లక్షల చొప్పున పదేళ్ల పాటు కేటాయించాల్సి ఉందన్నారు. రైల్వేల్లో ప్రైవేటు పెట్టుబడులను ఆహ్వానిస్తున్నామని తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద సరుకు రవాణా వ్యవస్థగా మారుస్తామని స్పష్టం చేశారు. గడిచిన 30 ఏళ్లలో అనేక ప్రాజెక్టులు ప్రారంభించారు తప్ప పూర్తి చేయలేదన్నారు.

గత పదేళ్లలో రూ.60 వేల కోట్ల ఖర్చుతో 99 కొత్త లైన్లు మంజూరు చేశారు... కానీ ఇవాళ్టికి ఒక్కలైనే పూర్తి అయిందని ఆయన వెల్లడించారు. నాలుగు ప్రాజెక్టులు 30 ఏళ్ల పైబడి పెండింగ్ ఉన్నాయని, గత ప్రభుత్వాలకు విషయాలు అన్నీ తెలిసినా చప్పట్లు కొట్టించుకోవడం కోసం రాజీ పడ్డారని విమర్శించారు. దశాబ్దాల తరబడి రైల్వే నిధుల కొరతను ఎదుర్కుంటోందని, అస్వవ్యస్త విధానల వల్ల రైల్వేలు తమ కర్తవ్యం నెరవేర్చలేకపోయాయన్నారు. కాగా, రైల్వే బడ్జెట్‌ను ఎండీఎంకె స్వాగతించగా.. జేడీయు మండిపడింది. రైల్వే బడ్జెట్ నిరాశపర్చిందని నితీష్ కుమార్ అన్నారు. ఎన్డీయేకు భవిష్యత్తు ప్రణాళిక లేదన్నారు.

రైల్వే బడ్జెట్

రైల్వే బడ్జెట్

2014-15 వ సంవత్సరానికి రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ రూ.1,64,374 కోట్లతో బడ్జెట్‌ను సిద్ధం చేశారు. మంత్రి మంగళవారంనాడు పార్లమెంటులో రైల్వే బడ్జెట్‌ను ప్రవేశ పెట్టారు.

రైల్వే బడ్జెట్

రైల్వే బడ్జెట్

రైళ్లలో బయోటాయిలెట్ సౌకర్యం, ఈ-టికెటింగ్ విధానంలో రైల్వే రిజర్వేషన్, అత్యాధునిక సౌకర్యాలు, సురక్షిత ప్రయాణం మొదలైన అంశాలను దృష్టిలో పెట్టుకుని రైల్వే బడ్జెట్‌ను రూపొందించినట్టు ప్రకటించారు.

రైల్వే బడ్జెట్

రైల్వే బడ్జెట్

ప్రతి బడ్జెట్‌లోనూ రైల్వే ప్రాజెక్టులను ప్రారంభించడమే గాని వాటిని పూర్తి చేయడంపై ఇప్పటివరకూ దృష్టి పెట్టలేదని వాపోతూ మంత్రి సదానంద తమ బడ్జెట్ ప్రతిపాదనలను పార్లమెంటులో ప్రవేశపెట్టారు. భారత రైల్వేను గాడిలో పెట్టవలసిన అవసరం ఎంతో ఉందని, అయితే దాన్ని సాధించడానికి లక్షలాది కోట్లను ఖర్చు పెట్టవలసి ఉంటుందని ఆయన చెప్పారు.

సదానంద గౌడ

సదానంద గౌడ

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం మధ్యాహ్నం లోకసభలో రైల్వే బడ్జెట్ 2014-15ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా లోకసభకు వస్తున్న సదానంద.

రైల్వే బడ్జెట్

రైల్వే బడ్జెట్

ప్రస్తుత పరిస్థితులలో రైలు టిక్కెట్ల ధర లను పెంచడం ఒక్కటే పరిష్కారం అనుకోవడంలేదంటూనే కఠినమైనా తప్పదని, కొంతమేర టిక్కెట్లు పెంచుతున్నట్టు సదానంద వెల్లడించారు. ఇంధనం ధరలు పెరిగినప్పుడు టిక్కెట్ల ధరలు పెరుగుతాయని కూడా మంత్రి తమ ప్రసంగంలో సూచనప్రాయంగా తెలియజేశారు.

సదానంద గౌడ

సదానంద గౌడ

రైల్వే శాఖ మంత్రి రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ తన జూనియర్ మంత్రి మనోజ్ సిన్హాతో కలిసి మంగళవారం పార్లమెంటుకు వస్తున్న దృశ్యం.

సదానంద గౌడ

సదానంద గౌడ

కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం మధ్యాహ్నం లోకసభలో రైల్వే బడ్జెట్ 2014-15ను ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా లోకసభకు వస్తున్న సదానంద.

రైల్వే బడ్జెట్

రైల్వే బడ్జెట్

భారత జాతికి రైల్వే జీవనాడి అని, దేశ భద్రతలో రైల్వేలు కీలక పాత్ర పోషిస్తున్నాయని కేంద్ర రైల్వే శాఖ మంత్రి సదానంద గౌడ మంగళవారం అన్నారు. రైల్వేబడ్జెట్-2014ను లోకసభలో కేంద్ర మంత్రి సదానంద ప్రవేశపెట్టారు.

English summary

 Railway Budget 2014 : Railway Minister D.V.Sadananda Gowda presented Railway Budget 2014-15. What's in the railway budget for Karnataka here is details.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X