చెన్నై వార్తల కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
Oneindia App Download

ఆ రోజు ఏం జరిగింది?: రాంకుమార్‌ ఆత్మహత్య ‘స్పాట్ ఫొటోలు’ లీక్, అధికారుల వివరణ

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడులో సంచలనం సృష్టించిన ఇన్ఫోసిస్‌ ఉద్యోగిని స్వాతి హత్య కేసులో నిందితుడు రాంకుమార్‌ ఆత్మహత్యపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో జైలు అధికారులు'ఆ రోజు ఏం జరిగిందనే' విషయంపై వివరిస్తున్నట్లు ఓ కథనం సామాజిక మాధ్యమాల్లో హల్ చల్ చేస్తోంది.

రాంకుమార్‌ ఆత్మహత్యపై అనుమానాలు ఉన్నాయనే ప్రచారాన్ని, అతడిని కారాగార సిబ్బంది కొట్టి చంపారనే ఆరోపణలను కారాగారవర్గాలు ఖండిస్తున్నట్లు, రాంకుమార్‌ బలవన్మరణానికి పాల్పడిన తీరును వివరిస్తూ ఈ కథనం కొనసాగింది.

'రాంకుమార్‌ బలవన్మరణానికి పాల్పడిన సాయంత్రం 4.45 గంటలు అనేది ఖైదీలకు ఆహారం అందించే సమయం. అందుకు పలువురు ఖైదీలు ఒకేచోట సమావేశమయ్యారు. అలాంటప్పుడు రాంకుమార్‌ను ఎలా హత్య చేయగలరు? రాంకుమార్‌ను కారాగారంలో ఉంచిన ప్రాంతాన్ని 'డిస్పెన్సరి బ్లాక్‌' అని పిలుస్తారు. ఇది ఉన్నత భద్రత కలిగిన ప్రాంతం. అక్కడ మూడంచెల భద్రత ఉంటుంది' అని వివరించారు.

అంతేగాక, 'రాంకుమార్‌ మాత్రమే అక్కడ ఒంటరిగా లేడు. అతనితో పాటు 27 మంది ఖైదీలూ ఉన్నారు. రాంకుమార్‌ తీవ్రమైన మానసిక ఒత్తిడిలో ఉన్నాడు. ఆ రోజు మధ్యాహ్నం భోజనం కూడా తినలేదు. అతడిని వ్యక్తిగతంగా పర్యవేక్షించడానికి పేచ్చిముత్తు అనే రెండో గ్రేడ్‌ పోలీసును నియమించారు. సాయంత్రం భోజనం కోసం రాంకుమార్‌ వచ్చినప్పుడు అతనితో పాటు పేచ్చిముత్తు కూడా ఉన్నాడు' అని తెలిపారు.

అయితే, 'నీళ్లు తాగొస్తానని చెప్పి వెళ్లిన రాంకుమార్‌ అకస్మాత్తుగా అక్కడి విద్యుత్తు పెట్టెను చేతితో పగులగొట్టి అందులోని తీగను పళ్ల మధ్యలో బిగించాడు. ఈ అనూహ్య పరిణామం జరిగినప్పుడు రాంకుమార్‌కు పది అడుగుల దూరంలో పేచ్చిముత్తు ఉన్నాడు. ఆయనతో పాటు మరో నలుగురు ఖైదీలూ ఉన్నారు. రాంకుమార్‌ చర్యలతో అంతా దిగ్భ్రాంతికి గురయ్యారు' అని వివరించారు.

{photo-feature}

English summary
As per prison officials, Ramkumar was found lying unconscious with a live electric wire in his mouth near the dispensary and the claim was based on the presumption that he pulled out the wire from a switch board and bit into it.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X