వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

కదిలించిన ఢిల్లీ ఘటన: పులిని ప్రాధేయపడిన విద్యార్థి!

By Srinivas
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: దేశ రాజధాని న్యూఢిల్లీలోని ఓ జూలో తెల్లపులి ఇంటర్మీడియట్ సెకండియర్ విద్యార్థిని చంపిన విషయం తెలిసిందే. ఎన్‌క్లోజర్‌లో పడిన విద్యార్థి... తనను ఏం చేయవద్దంటూ కొద్ది నిమిషాల సేపు పులిని ప్రాధేయపడిన సంఘటన అందరినీ కదిలించింది. చనిపోవడానికి ముందు అతను తీవ్ర ఆందోళనకు గురయ్యాడు.

యువకుడిని పొట్టన పెట్టుకున్న పులి పేరు విజయ్. 2007లో జన్మించిన దీని బరువు 200 కిలోలు. ఇది రోజుకు పది కిలోల మాంసం తింటుంది.

పులి ఉండే ఆవరణలో ఆ యువకుడు పడినా కాసేపటి వరకు పులి అతని పైన దాడి చేయలేదని, ఇంతలో దాని పైకి రాళ్లు విసరడంతో దాడికి పాల్పడిందనే వాదనలు వినిపిస్తున్నాయి. యువకుడు ఎన్‌క్లోజర్‌లో పడిపియిన విషయమై పలు రకాల వాదనలు వినిపించిన విషయం తెలిసిందే.

తెల్లపులి

తెల్లపులి

తెల్లపులి తన ఎన్‌క్లోజర్‌లోకి పడిపోయిన ఈ 20 ఏళ్ల యువకుడిని చంపేసిన వళ్లు గగుర్పొడిచే సంఘటనను జూ సందర్శన కోసం వచ్చిన కొందరు తమ మొబైల్ ఫోన్లలో చిత్రీకరించారు. ఢిల్లీలోని అనంద్ పర్బత్ ప్రాంతానికి చెందిన మక్సూద్ అనే ఇరవై ఏళ్ల యువకుడు పులుల ఎన్‌క్లోజర్ వద్ద ఉన్న రక్షణ గోడపై నుంచి లోపలికి తొంగిచూస్తూ, ఫోటో తీయబోతూ లోపలికి పడిపోయాడు.

తెల్లపులి

తెల్లపులి

ఎదురుగా భయంతో వణుకుతూ రెండు చేతులూ జోడించి తనను వదిలిపెట్టమంటూ ప్రార్థిస్తున్నట్టు కూర్చుని వున్న యువకుడిని చూసిన పులి కొద్ది నిమిషాల పాటు అలాగే కదలకుండా చూస్తూ ఉండిపోయింది. అయితే పులి దృష్టిని మళ్లించడానికి ఈ దృశ్యాన్ని చూస్తున్న వాళ్లు, కాపలాదారు దాని పైకి రాళ్లు రువ్వడం, కేకలు వేయడం లాంటివి చేయడంతో ఒక్కసారిగా పులి ప్రవర్తనలో మార్పు వచ్చిందని, యువకుడిపై దాడి చేసి అతని మెడను నోటకరుచుకని ఎన్‌క్లోజర్‌లోపలికి లాక్కుపోయిందంటున్నారు.

 తెల్లపులి

తెల్లపులి

మక్సూద్ ఎన్‌క్లోజర్‌లో ఎలా పడిపోయాడనే దానిపై రకరకాల కథనాలు వినిపిస్తున్నాయి. కేవలం రెండడుగుల ఎత్తున్న రక్షిత గోడపైనుంచి తొంగిచూస్తూ మక్సూద్ ఎన్‌క్లోజర్‌లో పడిపోయాడని కొంతమంది ప్రత్యక్ష సాక్షులు చెబుతుంటే, మక్సూద్ ఐరన్ ఫెన్సింగ్‌ను దాటుకుని ఇటుక గోడవద్దకు వెళ్లి అక్కడినుంచి ఎన్‌క్లోజర్ లోపలికి దూకేసాడని జూ అధికారులు, మరికొందరు ప్రత్యక్ష సాక్షులు అంటున్నారు.

తెల్లపులి

తెల్లపులి

అంతకుముందు రెండు మూడుసార్లు మక్సూద్ ఐరన్ ఫెన్సింగ్ దాటి వెళితే అక్కడే ఉన్న గార్డు హెచ్చరించాడని కూడా అంటున్నారు. ఈలోగా కొంతమంది స్కూలు విద్యార్థులు రావడంతో గార్డు దృష్టి వారివైపు మళ్లిందని, దాంతో మక్సూద్ ఒక్కసారిగా 18 అడుగుల దిగువనున్న ఎన్‌క్లోజర్‌లోకి దూకేసాడని వారు చెప్తున్నారు. పులి మక్సూద్‌ను నోటకరుచుకుని లాక్కెళుతూ ఉన్నా సెక్యూరిటీ గార్డుల వద్ద పులిని మత్తులోకి పంపేందుకు అవసరమైన ట్రాంక్విలైజర్ గన్స్ లేకపోవడంతో ఏం చేయలేకపోయారని అంటున్నారు.

 తెల్లపులి

తెల్లపులి

జూ చరిత్రలో ఇలాంటి సంఘటన జరగడం ఇదే మొదటిసారని, సంఘటన జరిగిన తర్వాత తెల్లపులిని బోనులో పెట్టి తాళం వేశామని జూ పార్కు క్యూరేటర్ ఆర్‌ఏ ఖాన్ చెప్పారు.

<div id="vnVideoPlayerContent"></div><script>var ven_video_key="NTc3Mzg2fHwxMDExfHwwfHx8fHx8";var ven_width="405";var ven_height="325";</script><script type="text/javascript" src="http://ventunotech.com/plugins/cntplayer/ventuno_player.js"></script>

English summary
An unidentified youth on Tuesday was killed by a white tiger after he jumped into the animal's cage in Delhi Zoo, an official said.&#13;
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X