వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టాటా అధినేతగా గర్వకారణం: చంద్ర సంచలన కామెంట్స్

తనను చైర్మన్‌గా నియమించినందుకు సంస్థ డైరెక్టర్ల బోర్డుకు కృతజ్ఞత తెలియజేస్తున్నానని చంద్రశేఖరన్ మీడియాకు చెప్పారు. ఇక నుంచి సంస్థ చైర్మన్‌గా దాని బలోపేతానికి చర్యలు తీసుకుంటానన్నారు

By Swetha Basvababu
|
Google Oneindia TeluguNews

ముంబై: దేశంలోకెల్లా అతిపెద్ద పారిశ్రామిక సంస్థల గ్రూప్ 'టాటా సన్స్' నూతన చైర్మన్‌గా నటరాజన్ చంద్రశేఖరన్ మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. సంస్థ సీఎండీగా పదవీ బాధ్యతలు స్వీకరించిన తొలి పార్శీయేతర వ్యక్తిగా ఆయన రికార్డు నెలకొల్పారు. తాను టాటా సన్స్ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించడం గర్వ కారణంగా ఉన్నదని చంద్రశేఖరన్ వ్యాఖ్యానించారు. అత్యంత వైవిధ్య భరితమైన పారిశ్రామిక గ్రూపునకు చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించిన చంద్రశేఖరన్‌కు, సంస్థకూ చారిత్రకం కానున్నది. తనను చైర్మన్‌గా నియమించినందుకు సంస్థ డైరెక్టర్ల బోర్డుకు కృతజ్ఞత తెలియజేస్తున్నానని చంద్రశేఖరన్ మీడియాకు చెప్పారు. ఇక నుంచి సంస్థ చైర్మన్‌గా దాని బలోపేతానికి చర్యలు తీసుకుంటానన్నారు.

అందరి మనస్సులూ చూరగొంటామన్న చంద్రశేఖరన్ క్రమశిక్షణతో ముందుకు వెళ్తామని వెల్లడి

అందరి మనస్సులూ చూరగొంటామన్న చంద్రశేఖరన్ క్రమశిక్షణతో ముందుకు వెళ్తామని వెల్లడి


‘టాటా సన్స్.. భారతదేశంలోనూ, వివిద దేశాల్లోనూ లక్షల మంది కోట్ల మనస్సుల్లో చోటు దక్కించుకున్నది. పెట్టుబడుల కేటాయింపుల్లోనూ, వాటాదారుల రిటర్న్స్ చెల్లింపుల్లోనూ మేం క్రమశిక్షణతో కలిసి పనిచేస్తాం. కంపెనీ నాయకత్వం ఎల్లవేళలా స్ఫూర్తిదాయకంగా వ్యవహరిస్తూ ముందుకు సాగుతుంది. ఈ క్రమంలో మీడియా, గ్రూప్ సంస్థల సిబ్బంది సహకారం తీసుకుంటా' అని చంద్రశేఖరన్ చెప్పారు.

ఐక్యతతో పనిచేస్తామని ప్రతీన పనితీరుపై చంద్రశేఖరన్ ఇలా..

ఐక్యతతో పనిచేస్తామని ప్రతీన పనితీరుపై చంద్రశేఖరన్ ఇలా..


‘మేం కలిసి పనిచేస్తూ ముందుకెళ్తాం. పారిశ్రామిక రంగంలో మా గ్రూపు బిజినెస్‌ను ముందు వరుసలో నిలుపుతాం' అని అన్నారు. మంగళవారం ఉదయం 9.15 గంటలకు ముంబైలోని బాంబే హౌస్ కార్యాలయంలో అడుగు పెట్టారు. ఆ తర్వాత 15 నిమిషాల వ్యవధిలో టాటా దిగ్గజం రతన్ టాటా, ఇతర బోర్డు సభ్యులు అక్కడికి చేరుకున్నారు.

టీసీఎస్ సీఈఓ నుంచి టాటా సన్స్ వరకు

టీసీఎస్ సీఈఓ నుంచి టాటా సన్స్ వరకు


టాటా సన్స్ చైర్మన్‌గా నియామకమైన చంద్రశేఖరన్‌.. ఇంతకుముందు టీసీఎస్ సీఈఓ - ఎండీగా బాధ్యతలు నిర్వహించారు. ఇక టాటా స్టీల్, టాటా మోటార్స్, టటా పవర్ సంస్థలకు కూడా చైర్మన్‌గా వ్యవహరిస్తారు.

రతన్ టాటా నుంచి చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ

రతన్ టాటా నుంచి చైర్మన్‌గా బాధ్యతల స్వీకరణ


రతన్ టాటా (79) నుంచి టాటా సన్స్ చైర్మన్‌గా చంద్రశేఖరన్ బాధ్యతలు స్వీకరించారు. 2016 అక్టోబర్ 24న అనూహ్య పరిస్థితుల్లో సైరస్ మిస్త్రీ స్థానంలో రతన్ టాటా సంస్థ చైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించారు.

సంతోషంగా ఉందన్న చంద్ర

సంతోషంగా ఉందన్న చంద్ర


‘సంస్థ చైర్మన్ గా బాద్యతలు స్వీకరించినందుకు సంతోషంగా ఉన్నది. కంపెనీ గర్వం, ప్రతిష్ఠ పెంచేందుకు అవసరమైన ప్రతి చర్య తీసుకుంటాం' అని ఆయన పష్టం చేశారు.

English summary
It will be a historic moment when Natarajan Chandrasekaran takes over as Chairman, Tata Sons, being the first non-Parsi to take over reigns of the country's most diversified business group.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X