• search
  • Live TV
వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts

ఊపేసిన సెక్స్ స్కాండల్స్: రాజకీయ నేతలు (పిక్చర్స్)

By Pratap
|

న్యూఢిల్లీ: రాజకీయాలకు, సెక్స్ కుంభకోణాలకు అవినాభావ సంబంధం ఉన్నట్లు కనిపిస్తోంది. పలువురు రాజకీయ నాయకులు ఇటీవలి కాలంలో సెక్స్ కుంభకోణాల్లో ఇరుక్కున్న వైనాలు వెలుగు చూశాయి. తాజాగా, రాజస్థాన్ రాష్ట్ర మంత్రి బాబులాల్ నగర్ తనపై అత్యాచార ఆరోపణలు రావడంతో పదవికి రాజీనామా చేశారు.

తనకు ఉద్యోగం ఇప్పిస్తానని పిలిచి, ఇంటిలో తనపై బాబూలాల్ నగర్ అత్యాచారం చేశారని 35 ఏళ్ల మహిళ ఆరోపించింది. ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా పనిచేసిన కాలంలో ప్రముఖ రాజకీయ నాయకుడు ఎన్డీ తివారీ సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నారు. దానికితోడు, తన తల్లితో వైవాహికేతర సంబంధం కారణంగా తాను ఎన్డీ తివారీకి జన్మించానని ఓ యువకుడు కోర్టుకు ఎక్కాడు.

సెక్స్ కుంభకోణాల్లో చిక్కుకుని కొంత మంది రాజకీయ నాయకులు తమ రాజకీయ భవిష్యత్తును పాడు చేసుకున్న సంఘటనలు కూడా ఉన్నాయి. పదవులకు రాజీనామాలు చేయాల్సి రావడం, రాజకీయ భవిష్యత్తు కోల్పోవడం వంటి పరిణామాలకు దారి తీశాయి.

బాబూలాల్ నగర్‌పై అత్యాచార ఆరోపణలు

బాబూలాల్ నగర్‌పై అత్యాచార ఆరోపణలు

రాజస్థాన్‌కు చెందిన మంత్రి బాబులాల్ నగర్‌ తనపై అత్యాచారానికి పాల్పడ్డారని ఓ మహిళ ఆరోపణలు చేసింది. దీంతో ఆయన మంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. ఆయనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

మహిపాల్ మెడర్నా - భన్వరీ దేవి

మహిపాల్ మెడర్నా - భన్వరీ దేవి

2011లో రాజస్థాన్ మంత్రిగా పనిచేసిన మహిపాల్ మెడర్నా సెక్స్ స్కాండల్ తీవ్ర సంచలనం సృష్టించింది. భన్వరీదేవీ అనే మహిళను అపహరించి, ఆమెపై అత్యాచారం చేసి, చంపేశారని ఆరోపణలు వచ్చాయి. 2011 సెప్టెంబర్ 1వ తేదీన భన్వరీ దేవి హత్యకు గురైంది. మెడర్నా ప్రోద్బలంతో మల్కాన్ సింగ్ అనే ఎమ్మెల్యే ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

గోపాల్ గోయల్ కందా - గీతికా శర్మ

గోపాల్ గోయల్ కందా - గీతికా శర్మ

23 ఏళ్ల ఎయిర్ హోస్టెస్ గీతికా శర్మ ఆత్మహత్య కేసులో హర్యానాకు చెందిన మాజీ మంత్రి గోపాల్ గోయల్ కందాపై ఆరోపణలు వచ్చాయి. గోపాల్ కందా లైంగిక వేధింపులు భరించలేక గీతికా శర్మ ఆత్మహత్య చేసుకున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ఢిల్లీలోని అశోక్ విహార్ నివాసంలో గీతికా శర్మ నిరుడు ఆగస్టు 12వ తేదీన ఆత్మహత్య చేసుకుంది.

అమర్ మణి త్రిపాఠీ - మధుమితా శుక్లా

అమర్ మణి త్రిపాఠీ - మధుమితా శుక్లా

24 ఏళ్ల కవయిత్రి మధుమిత శుక్లా హత్య కేసులో సమాజ్‌వాదీ పార్టీ నేత అమర్ మణి త్రిపాఠీ దోషిగా తేలాడు. 2003 ఏప్రిల్ 9వ తేదీన మధుమితా శుక్లాను ఇద్దరు వ్యక్తులు ఆమె నివాసంలో కాల్చి చంపారు. ఈ కేసులో అమర్ మణి త్రిపాఠీ, ఆయన భార్య మధుమణి, మరో ఇద్దరు రోహిత్ చతుర్వేది, సంతోష్ కుమార్ రాయ్‌లకు డెహ్రాడూన్ కోర్టు 2007లో జీవిత ఖైదు విధించింది.

ఆనంద్ సేన్ యాదవ్ - శశి

ఆనంద్ సేన్ యాదవ్ - శశి

న్యాయశాస్త్ర విద్యార్థిని శశితో అక్రమ సంబంధం కలిగి ఉన్నాడనే ఆరోపణలు రావడంతో బిఎస్పీ నేత ఆనంద్ సేన్ యాదవ్ 2011లో తన రాజకీయ భవిష్యత్తునే కోల్పోయారు. శశిని కిడ్నాప్ చేసి హత్య చేశారనే ఆరోపణలపై యాదవ్ దోషిగా తేలారు. 2007 అక్టోబర్ 22వ తేదీన శశి అపహరణకు గురైంది. ఆ తర్వాత ఆమె శవమై తేలింది.

ఎన్డీ తివారీ సెక్స్ స్కాండల్

ఎన్డీ తివారీ సెక్స్ స్కాండల్

ఆంధ్రప్రదేశ్ గవర్నర్‌గా ఉన్న కాలంలో ముగ్గురు మహిళలతో అసహజ లైంగిక క్రీడ సాగిస్తూ 87 ఏళ్ల ఎన్డీ తివారీ కెమెరాకు చిక్కాడు. రాజభవన్‌లో ముగ్గురు మహిళలతో లైంగిక క్రీడ సాగించిన వీడియో టేప్‌లను ఓ తెలుగు టీవి చానెల్ ప్రసారం చేసింది. దాంతో ఆయన పదవికి రాజీనామా చేశారు.

రాఘవ్‌జీ - స్వలింగ సంపర్కం

రాఘవ్‌జీ - స్వలింగ సంపర్కం

మధ్యప్రదేశ్ శాసనససభ్యుడు రాఘవ్‌జీ తన పనిమనిషితో స్వలింగ సంపర్కానికి పాల్పడినట్లు 2013 జులై 5వ తేదీన ఆరోపణలు వచ్చాయి. దాంతో ఆయన ఆర్థిక మంత్రిగా రాజీనామా చేయాల్సి వచ్చింది. ప్రభుత్వోద్యోగం ఇప్పిస్తానని హామీ ఇచ్చి తనను లైంగికంగా వాడుకున్నాడని పని మనిషి ఆరోపించాడు.

ఎస్పీ ఎమ్మెల్యే (ఎడమ నుంచి రెండో వ్యక్తి)

ఎస్పీ ఎమ్మెల్యే (ఎడమ నుంచి రెండో వ్యక్తి)

ఉత్తరప్రదేశ్‌కు చెందిన ఎస్పీ ఎమ్మెల్యే మహేంద్ర సింగ్ మరో ఆరుగురితో పాటు గోవాలోని డ్యాన్స్ బార్‌లో పోలీసులకు పట్టుపడ్డాడు. సీతాపూర్ నుంచి నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన మహేంద్ర సింగ్‌పై పోలీసులు వ్యభిచార నిరోధక చట్టం కింద కేసు నమోదు చేశారు. ఆరుగురు అమ్మాయిలకు విముక్తి కలిగించారు. ఎస్పీ నుంచి ఆయన సస్పెన్షన్‌కు గురయ్యారు.

అభిషేక్ మను సింఘ్వీ - సెక్స్ టేప్

అభిషేక్ మను సింఘ్వీ - సెక్స్ టేప్

కాంగ్రెసు మాజీ అధికారి ప్రతినిధి అభిషేక్ మను సింఘ్వీ సెక్స్ సీడీ ఆరోపణలు ప్రతి ఒక్కరిని దిగ్భ్రాంతికి గురి చేశాయి. 2012 ఏప్రిల్‌లో ఇది వెలుగు చూసింది. కోర్టు చేంబర్ రూంలో ఓ మహిళా న్యాయవాదితో సెక్స్ చేస్తూ సింఘ్వీ సీడిలో కనిపించారు. న్యాయమూర్తిగా చేస్తానని సింఘ్వీ ఆమెకు హామీ ఇచ్చినట్లు ఆరోపణలు వచ్చాయి.

హరక్ సింగ్ రావత్ సెక్స్ కుంభకోణం

హరక్ సింగ్ రావత్ సెక్స్ కుంభకోణం

కాంగ్రెసు పార్టీకి చెందిన ఉత్తరాఖండ్ ముంతిరి హరక్ సింగ్ రావత్ 2003లో ఆరోపణలు ఎదుర్కున్నారు. అస్సాం మహిళ ఆరోపణలతో ఆయన రాజకీయ జీవితాన్నే కోల్పోయారు.

సాధు యాదవ్ - రేప్ ఆరోపణలు

సాధు యాదవ్ - రేప్ ఆరోపణలు

రాష్ట్రీయ జనతా దళ్ (ఆర్‌జెడి) అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ బావమరిది సాధూ యాదవ్ అలియాస్ అనిరుధ్ ప్రసాద్ 1999లో ఓ అమ్మాయిపై అత్యాచారం చేసి, ఆమెను హత్య చేసినట్లు ఆరోపణలు వచ్చాయి.

పోర్న్ చూస్తూ పట్టుబడిన మంత్రులు

పోర్న్ చూస్తూ పట్టుబడిన మంత్రులు

2012లో ముగ్గురు మంత్రులు లక్ష్మణ్ సవది, జె. కృష్ణ పలేమర్, సిసి పాటిల్ శాసనసభలో మొబైల్ ఫోన్లలో పోర్న్ క్లిప్ చూస్తూ పట్టుబడ్డారు. ఈ సంఘటన బిజెపిని ఇరకాటంలో పడేసింది. పాశ్చాత్య దేశంలో ఓ మహిళపై జరిగిన గ్యాంగ్ రేప్ దృశ్యాలను చూస్తూ వారు పట్టుబడ్డారు.

ఒమర్ అబ్దుల్లా సెక్స్ స్కాండల్

ఒమర్ అబ్దుల్లా సెక్స్ స్కాండల్

సెక్స్ కుంభకోణంలో చిక్కుకున్నట్లు జమ్మూ కాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లాపై తీవ్రమైన ఆరోపణలు వచ్చాయి. అమ్మాయిలను రాజకీయ నేతలకు, పోలీసు అధికారులకు, ప్రభుత్వాధికారులకు సరఫరా చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. వారిలో మైనర్ బాలికలు కూడా ఉన్నట్లు వార్తలు వచ్చాయి. దీంతో వారాల తరబడి హింసాత్మక నిరసనలు చోటు చేసుకున్నాయి.

English summary
Politics and sex- a deadly mix has ruined the political career of many tall figures, not only in abroad, but in India as well.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Oneindia sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Oneindia website. However, you can change your cookie settings at any time. Learn more
X