వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

సిగ్గుచేటు: రోడ్డు పక్కన గోడపై మూత్రం చేస్తూ చిక్కిన మంత్రి!

|
Google Oneindia TeluguNews

జైపూర్: రాజస్థాన్‌‌లో అధికార భారతీయ జనతా పార్టీపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కారణ ఏమంటే.. ఆ రాష్ట్రానికి చెందిన ఆరోగ్యశాఖా మంత్రి కాళీచరణ్ షరాఫ్.. పింక్ సిటీగా పేరున్న జైపూర్ గోడలపై మూత్రం పోయడమే.

ఈ ఫొటోలు ఇప్పుడు నెట్‌లో వైరల్ మారడంతో ప్రతిపక్షాలతోపాటు నెటిజన్లు కూడా విమర్శలు గుప్పిస్తున్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం స్వచ్ఛ భారత్, స్వచ్ఛ సర్వేక్షణ్ పేరుతో కార్యక్రమాలు చేపడుతుంటే.. రాష్ట్ర మంత్రి ఇలాంటి పని చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.

Picture of Rajasthan Minister Urinating on Jaipur Walls Goes Viral

ఓ వైపు స్వచ్ఛ భారత్ అభియాన్ పథకం కింద జైపూర్ మున్సిపల్ కార్పొరేషన్ స్వచ్ఛత దేశంలోనే అగ్రభాగాన ఉండేందుకు కృషి చేస్తుంటే.. బాధ్యత గల మంత్రి చేసిన పని సిగ్గుచేటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

బీజేపీ ప్రవేశపెట్టిన పథకాలు ఆ పార్టీ మంత్రులే నీరుగారుస్తున్నారని రాష్ట్ర కాంగ్రెస్ నేతలు మండిపడుతున్నారు. కాగా, జైపూర్‌లో రోడ్డు పక్కల మూత్రం పోస్తే రూ. 200 జరిమానా కూడా విధిస్తున్నారు.

English summary
In embarrassment for the BJP government in Rajasthan, a picture of state Health Minister Kalicharan Saraf urinating on the walls of the Pink City has gone viral. He however shrugged it off, saying it was "not a big issue".
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X