వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

లోకసభ ఎన్నికలకు తారల గ్లామర్ ఇలా (పిక్చర్స్)

By Pratap
|
Google Oneindia TeluguNews

న్యూఢిల్లీ: లోకసభ ఎన్నికల్లో సినీ తారలు తళుక్కుమంటున్నారు. పలువురు తారలు ఎన్నికల్లో పోటీ చేస్తుండగా, మరికొందరు తారలు తమ వారి కోసం ప్రచారం చేస్తున్నారు. దేశవ్యాప్తంగా వివిధ లోకసభ స్థానాల్లో కాంగ్రెసు, బిజెపి సహా అన్ని పార్టీలు సాధ్యమైనంత మేరకు సినీ నటులను పోటీకి దించాయి.

సినీ తారలు జయప్రద, నగ్మా, హేమమాలిని వివిధ పార్టీల నుంచి పోటీలో ఉన్నారు. వారు ప్రచారంలో దూసుకుపోతున్నారు. ప్రజలు వారిని చూసేందుకు ఎగబడుతున్నారు. తమ గ్లామర్ కారణంగా నగ్మా, హేమమాలిని వంటి తారలు ప్రచారంలో ఇబ్బందులు కూడా ఎదుర్కుంటున్నారు.

తెరపై అందాలు ఒలకబోసిన తారలు కళ్ల ముందుకు రావడంతో అభిమానులు తమ ఉత్సాహాన్ని నిలువరించుకోలేక వారికి దగ్గరగా వెళ్లడానికి ప్రయత్నిస్తున్నారు. తారలు ప్రచారంలో దూసుకుపోతున్న తీరు ఆసక్తికరంగా ఉంది.

రాఖీ సావంత్ ఇలా..

రాఖీ సావంత్ ఇలా..

ఓ రాజకీయ పార్టీని స్థాపించి ముంబైలో నామినేషన్ కూడా వేసిన ఐటం గర్ల్ రాఖీ సావంత్ దాంతో ఆగడం లేదు, ప్రచారం కూడా చేస్తున్నారు. నామినేషన్ దాఖలు చేసిన తర్వాత ఆమె ఇలా..

అమర్ సింగ్ కోసం శ్రీదేవి..

అమర్ సింగ్ కోసం శ్రీదేవి..

ఆర్ఎల్‌డి నేత అమర్ సింగ్ తరఫున ఫతేపుర్ సిక్రీలో బాలీవుడ్ నటి శ్రీదేవి, ఆమె భర్త బోనీ కపూర్ ప్రచారం సాగించారు.

మోనికా బేడీ ఇలా..

మోనికా బేడీ ఇలా..

అబూ సేలం ప్రేమాయణంతో ప్రచారంలోకి వచ్చిన సినీ నటి మోనికా బేడీ సంభాల్ నియోజకవర్గంలో కాంగ్రెసు అభ్యర్థి ఆచార్య ప్రమోద్ కృష్ణం తరఫున ప్రచారం సాగిస్తున్నారు.

హేమమాలిని ఇలా..

హేమమాలిని ఇలా..

డ్రీమ్ గర్ల్ హేమమాలిని మథుర నియోజకవర్గం నుంచి లోకసభకు పోటీ చేస్తున్నారు. ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు.

నగ్మాకు కష్టాలే కష్టాలు..

నగ్మాకు కష్టాలే కష్టాలు..

మీరట్ లోకసభ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచే ఆమెకు కష్టాలు ప్రారంభమయ్యాయి. వాటిని తట్టుకుంటూనే ఆమె ప్రచారంలో దూసుకుపోతున్నారు.

వినోద్ ఖన్నా ఇలా..

వినోద్ ఖన్నా ఇలా..

ప్రముఖ సినీ నటుడు వినోద్ ఖన్నా కథువా జిల్లాలో ఎన్నికల ప్రచారం చేస్తూ ఇలా కనిపించారు.

అనిల్ కపూర్ మద్దతు..

అనిల్ కపూర్ మద్దతు..

బాలివుడ్ నటుడు అనిల్ కపూర్ బిజెపి అభ్యర్థి కిరోన్ ఖేర్‌కు ఓటేయాలని అడుగుతూ ప్రచారం సాగించారు.

వివేక్ ఒబెరాయ్ ఇలా..

వివేక్ ఒబెరాయ్ ఇలా..

వర్మ రక్తచరిత్ర సినిమాలో పరిటాల రవి పాత్రను పోషించిన వివేక్ ఒబెరాయ్ నాగపూర్ నియోజకవర్గంలో బిజెపి అభ్యర్థి నితిన్ గడ్కరీ కోసం ప్రచారం సాగించారు.

రతి అగ్నిహోత్రిలా..

రతి అగ్నిహోత్రిలా..

ఒకప్పుడు ప్రేక్షకులను గిలిగింతలు పెట్టిన సినీ నటి రతి అగ్నిహోత్రి, భాగ్యశ్రీ వార్ధాలో కాంగ్రెసు అభ్యర్థి సాగర్ మెఘే కోసం ప్రచారం సాగించారు

శత్రుఘ్న సిన్హా ఇలా..

శత్రుఘ్న సిన్హా ఇలా..

పాట్నా నియోజకవర్గంలో ప్రముఖ సినీ నటుడు శత్రుఘ్న సిన్హా తన సతీమణితో కలిసి ప్రచారంలో సాగిస్తున్నారు.

నగ్మాకు అజరుద్దీన్ మద్దతు..

నగ్మాకు అజరుద్దీన్ మద్దతు..

సినీ నటి నగ్మాకు మద్దతుగా కాంగ్రెసు పార్లమెంటు సభ్యుడు, భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ అజరుద్దీన్ మీరట్ నియోజకవర్గంలో ప్రచారం సాగించారు.

English summary
Shatrughan Sinha along with his wife campaigning for elections in Patna
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X