వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

అమ్మ జయలలిత ఏ రోజు, ఎన్ని గంటలకు మరణించారు? హైకోర్టులో, స్టే ఇవ్వండి!

|
Google Oneindia TeluguNews

చెన్నై: తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత మృతి వ్యవహారం మరోసారి తెరమీదకు వచ్చింది. అన్నాడీఎంకే పార్టీ అధినేత్రి తొలి వర్దంతిని డిసెంబర్ 5వ తేదీ నిర్వహించకుండా స్టే విధించాలని మద్రాసు హైకోర్టులో పిటిషన్ దాఖలు అయ్యింది.

Recommended Video

Jayalalithaa 'Eternal General Secretary',Sasikala Removed ఆ పదవి ఎప్పటికీ జయలలితదే | Oneindia Telugu

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి అమ్మ జయలలిత తొలి వర్ధంతిని ప్రభుత్వం నిర్వహించకుండా స్టే విధించాలని కోరుతూ మద్రాసు హైకోర్టులో ప్రముఖ న్యాయవాది దురైస్వామి పిటిషన్‌ దాఖలు చేశారు.

 రెండు సార్లు ప్రకటించారు

రెండు సార్లు ప్రకటించారు

జయలలిత అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నపుడు ఆమె మరణించినట్టు డిసెంబర్ 5వ తేదీన రెండుసార్లు వేర్వురు సమయాల్లో ప్రకటించారని న్యాయవాది దురైస్వామి గుర్తు చేశారు.

 ఏ రోజు, ఎన్ని గంటలకు?

ఏ రోజు, ఎన్ని గంటలకు?

అయితే జయలలిత ఏ రోజు, కచ్చితంగా ఎన్ని గంటలకు మరణించారు తదితర అంశాలపై ప్రజల్లో చాలా అనుమానాలు ఉన్నాయని న్యాయవాది దురైస్వామి తెలిపారు.

విచారణ జరుగుతోంది!

విచారణ జరుగుతోంది!

జయలలిత మృతిపై తమిళనాడు ప్రభుత్వం కూడా మద్రాసు హైకోర్టు రిటైర్డ్‌ న్యాయమూర్తి ఆర్ముగస్వామి ఆధ్వర్యంలో కమిషన్‌ వేసి విచారణ జరిపిస్తోందని న్యాయవాది దురైస్వామి పిటిషన్‌లో వివరించారు.

స్టే ఇవ్వండి!

స్టే ఇవ్వండి!

అమ్మ జయలలిత మరణించిన తేదీ, సమయం నిర్ధారణ అయ్యే వరకు తమిళనాడు ప్రభుత్వం అధికారికంగా ఆమె తొలి వర్ధంతిని నిర్వహించేందుకు అనుమతించరాదని న్యాయవాది దురైస్వామి మద్రాసు హైకోర్టులో మనవి చేశారు.

 కోర్టులో ఏం చెప్పాలి?

కోర్టులో ఏం చెప్పాలి?

పిటిషన్ ను శుక్రవారం విచారణ జరుపుతామని మద్రాసు హైకోర్టు న్యాయమూర్తులు శివజ్ఞానం, జస్టిస్‌ సుందర్‌ తెలిపారు. మద్రాసు హైకోర్టుకు ఏం సమాధానం చెప్పాలి అంటూ తమిళనాడు ప్రభుత్వం ఆలోచనలో పడింది.

English summary
Calling into question the date of death of former TN chief minister Jayalalithaa, a PIL filed in the Madras High Court has said the Tamil Nadu government must be restrained from officially observing December 5 as her death anniversary since a judicial panel inquiring into the issue is yet to come out with its findings.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X