వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

వీడియో వైరల్: యుద్ధ విమానంను పక్షి ఢీకొనడంతో పైలట్ ఏంచేశాడో చూడండి..!

|
Google Oneindia TeluguNews

అంబాలా: ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌కు చెందిన జాగ్వార్ యుద్ధ విమానంను ఓ పిట్ట ఢీకొంది. అందులోని పైలట్ వెంటనే గుర్తించి చాకచక్యంగా వ్యవహరించడంతో పెను ప్రమాదం తప్పింది. యుద్ధ విమానంను పక్షి ఢీకొట్టగానే అంబాలా ఎయిర్‌బేస్‌లో ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశాడు. అయితే ఎమర్జెన్సీ ల్యాండింగ్‌కు ముందే అంటే విమానం గాల్లో ఉండగానే అందులోని ఇంధనం, ఇతర తేలిక బాంబులను కిందకు వదిలేశాడు. ఇలా చేయకపోతే భారీ ప్రమాదం జరిగి ఉండేదని అధికారులు చెప్పారు. పైలట్ చాకచక్యంగా వ్యవహరించడాన్ని అంతా కొనియాడారు.

iaf

యుద్ధ విమానం టేకాఫ్ తీసుకున్న కొద్ది సేపటికే ఇంజిన్ ఫెయిల్ అయ్యింది. ఓ పక్షి ఢీకొట్టడంతో ఇది జరిగిందని పైలట్ గ్రహించాడు. విమానంను పక్షులు ఢీకొంటే ఎలా రియాక్ట్ అవ్వాలనేదానిపై పైలట్లకు శిక్షణా సమయంలో నేర్పిస్తామని అయితే చాలా తక్కువ మంది చాకచక్యంతో వ్యవహరిస్తారని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది. పైలట్ చాకచక్యంతో చాలా మంది పౌరుల ప్రాణాలు కాపాడినవాడయ్యాడని ఇండియన్ ఎయిర్‌ఫోర్స్ తెలిపింది.

పక్షి ఢీకొనడంతో విమానంలోని ఒక ఇంజిన్ చెడిపోయిందని ఇలాంటి పరిస్థితుల్లో చాలామందికి ఎలా స్పందించాలో తెలియదని అధికారులు చెప్పారు. కానీ ఈ పైలట్ మాత్రం సరైన సమయంలో సరిగ్గా స్పందించాడని కొనియాడారు. అసలు సమస్య ఏమిటో కొన్ని సెకన్లలోనే పసిగట్టగలిగాడని వెంటనే ఇంధనం ట్యాంకులను కిందకు వదిలివేయడం వల్ల పెను ప్రమాదం తప్పిందని చెప్పారు. అయితే ఒక ఇంధనం ట్యాంకు అంబాలా సమీపంలోని నివాస ప్రాంతంలో పడిపోయిందని అయితే ఎవరికీ ఎలాంటి గాయాలు కాలేదని చెప్పారు. ప్రస్తుతం ఆ వీడియ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

English summary
The Indian Air Force (IAF) on Friday lauded a young pilot for his "quick thinking" after a flock of birds hit his fighter aircraft Jaguar on Thursday (June 27). The pilot made an emergency landing at Ambala air base after the Jaguar aircraft suffered a suspected bird hit.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X